25 మంది కామెడియన్స్ తో ‘పాండవులు’

Prasad

తెలుగు ప్రేక్షకులు కామెడిని ఎక్కువగా అదరిస్తారనే విషయం తెలిసిందే. ఈ నమ్మకంతోనే ‘పాండవులు’ సినిమా తెరెకెక్కింది. వై.ఎస్. బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమాకు వై.ఎస్.నాయుడు దర్శకత్వం వహించారు. 25 మంది కమెడియన్స్ నటించిన ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ‘ఈజీ మనీ నేపథ్యంలో కుర్రాళ్ళు పడే పాట్లు వినోదాత్మకంగా తెరకెక్కిన చక్కని కుటుంబ కధా చిత్రమిది’ అని చెప్పారు. 25 మంది హస్యనటులు నటించిన ఈ సినిమాలో కామెడితో పాటు, ఆడియన్స్ ని ధియేటర్ కి మళ్లీ మళ్లీ రప్పించేలా ఈ సినిమాలోని పాటలకు డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది.

 వేణుమాధవ్, అభినయ శ్రీ, యతిరాజా, జ్యోతి, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, కొండవలస, బాబుమోహన్, సుమన్ శెట్టి, తెలంగాణ శకుంతల తదితరులు ఈ పాండవులు సినిమాలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: