వారామంతా పుట్టినరోజు వేడుకలట !!! ఈ హీరోయిన్ కి
ప్రస్తుతం ఛార్మీ మంచి జోష్ మీద ఉంటో౦ది ఈ పంజాబీ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు ఏమీ లేకపోయినా ఈ ఆనందం ఏమిటీ అనుకుంటున్నారా! అయితే ఈ వార్త చదవండి. తన చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ బబ్లీగా ఉంటుంది ఛార్మీ. ఆడియో ఫంక్షన్స్, ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లలో ఛార్మీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
సినిమాలు లేకపోయినా యూత్ లో తన ఇమేజ్ తగ్గకుండా చూసుకుంటుంది ఛార్మీ. అందుకే ఐటమ్ సాంగ్ లు కూడా చేస్తూ తన ఇమేజ్ ను కాపాడుకుంటో౦ది. ప్రస్తుతం ‘ప్రేమ ఒక మైకం’ సినిమాలో వేశ్యగా నటిస్తూ ఛార్మీ ఆ సినిమా స్టిల్స్ ద్వారా యూత్ లో కేక పుట్టిస్తోంది. ఛార్మీ పుట్టినరోజు ఈ నెల 17వ తారీఖు. సామాన్యంగా ఎంత గొప్పవారైన తమ పుట్టినరోజు వేడుకలను తాము పుట్టిన తేదీనాడు జరుపు కుంటారు.
కానీ ఛార్మీ మాత్రం ఈ వారం అంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుందట. అది ఏమిటి అని ప్రశ్నస్తే ఒక్కరోజు పుట్టినరోజు చేసుకుంటే మజా ఏమి ఉంటుంది. అందుకునే ఈ వారం అంతా జోష్ మీద ఉంటాను అని చెపుతోంది. అంతేకాదు తన పుట్టిన రోజు రాకుండానే తన ట్విట్టర్ ద్వారా మెసేజ్ లు పెడుతూ నానా హడావిడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. వచ్చే నెల విడుదల అవుతున్న ‘ప్రేమ ఒక మైకం’ సినిమా ఛార్మీ అనుకున్నట్లుగా విజయవంతం అయితే ఇక ఛార్మీ మరెంత హడావిడి చేస్తుందో చూడాలి....