ఇబ్బందులలోనూ మారని సావిత్రి 

Prasad
మహానటిగా పేరు గాంచిన సావిత్రి తన చివరి రోజులలో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయినా ఆమె ఆ సమయంలోనూ తన దాన గుణాన్ని విడిచిపెట్టలేదు. సావిత్రి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి మాటలను బట్టీ ఆమె గతంలో తన వద్ద పని చేసిన కారు డ్రైవర్ కుమార్తె అని, సహయం కోరుతూ తన వద్దకు వచ్చిందని సావిత్రికి అర్థం అయ్యింది. దీంతో అమ్మాయిని ముందు గదిలో కూర్చొ పెట్టి తన దగ్గర ఉన్న పట్టుచీరను అమ్మి పెట్ట మని తనకు తెలిసిన వారిని వెనక గుమ్మం నుంచి పంపించింది. అతను ఆ చీర అమ్మిన తీసుకుని వచ్చిన డబ్బును అమ్మాయికి ఇచ్చి పంపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: