వైభవ్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు?

HANUMA HANUMA
 తెలుగు సినిమా దర్శకుల గురించి ఎవరు పుస్తకం రాసినా, వ్యాసం రాసినా కోదండరామిరెడ్డి గురించి చాలా ప్రత్యేకంగా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ గా పిలిపించుకుంటున్న చిరంజీవికి వరుస హిట్లు ఇచ్చి నిలబెట్టింది కోదండరామిరెడ్డి. తెరమీద వీరిద్దరి పేర్లు చూస్తే హాల్లో చప్పట్లకు చెవులు చిల్లులు పడేవి. అలాంటి కోదండరామిరెడ్డి తన కుమారుడు వైభవ్ ను హీరోగా నిలబెట్టుకోలేకపోయారన్నది వాస్తవం. వైభవ్ రెడ్డితో తెలుగులో కోదండరామిరెడ్డి స్వయంగా రెండు సినిమాలు చేశారు. కానీ ఆశించినంత ఫలితం రాలేదు. ఆ తర్వాత వైభవ్ తమిళానికి తరలి వెళ్ళారు. అక్కడ గంగై అమరన్ కుమారులతో చేతులు కలిపారు. వైభవ్ తమిళంలో పేరున్న హీరో. వైభవ్ కు తమిళంలో హిట్ తెచ్చింది తన స్నేహితులే. అందుకే తన ఇవాళ్టి పొజిషన్ను ఇచ్చింది తన స్నేహితులే అని గర్వంగా చెప్తారు వైభవ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: