అనాటి నటీమణి - నేటి ముఖ్యమంత్రి తల్లి

K Prakesh

తెలుగు సినిమాలలో ఈనాటికీ అపూర్వకళాఖండంగా నిలిచిపోయి ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణ పాత్రధారి రామారావు తో రుక్మిణి గా నటించిన అలనాటి తారామణి ఆర్.సంధ్య సినిమాల కోసం అని తీయి౦చుకున్న మొట్టమొదటి మేకప్ స్టిల్ ఇది.

సంధ్య కంటే ఆమె చెల్లెళ్ళు విద్యావతి సినిమాలలోకి ముందు వచ్చింది. ఆ తరువాత సంధ్య కూడా సినిమాలోకి వచ్చింది. అలనాటి మేటి నటుడు చిత్తూరు వి.నాగయ్య సంధ్య ను విజయావారికి షిఫార్స్ చేశారట. వారు ఆ సమయంలో “చంద్రహారం” సినిమాను తీస్తున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా సంధ్య ను తీసుకుందాం అనుకున్నారు కాని చంద్రహారం సినిమాలో హీరోయిన్ ది బరువైన పాత్ర కాబట్టి ఆ పాత్రను అనుభవం ఉన్నవారికి ఇద్దాం అనే ఉద్దేశంతో ఆరోజుల్లో జూనియర్ శ్రీరంజని చేత నటింప చేశారు. విజయావారి సినిమాలో నటిద్ధామన్న కోరిక తీరకుండానే ఉండిపోయిన సంధ్య కు అనుకోకుండా ఆదే సంస్థ నిర్మించే మాయాబజార్ లో రుక్మిణి పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అయితే నేటివిటీ కోసం సంధ్య కు టి.జి.కమలాదేవి తో డబ్బింగ్ చెప్పించారట.

తరువాత భానుమతి ప్రోత్సాహంతో అనేక చిత్రాలలో ఈమె నటించారు. తెనాలి రామకృష్ణ, లవకుశ, సంపూర్ణ రామాయణం, భార్య భర్తలు, కుల గోత్రాలు, వెలుగునీడలు వంటి సినిమాలలో గుర్తుండిపోయే పాత్రలు ఈమె చేశారు. ఇంతకీ ఈమె తమిళనాడు రాష్ట్రాన్ని ఏకచత్రాదిపత్యంగా పరిపాలిస్తున్న జయలలిత తల్లి ఈ సంధ్య అన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: