కమల్‌కి సారీ చెప్పిన కాజల్
ఇందులో కథానాయికగా కాజల్‌ని సంప్రదించారు. అయితే కాజల్ ఈ ఆఫర్‌ని తిరస్కరించిందట.కాల్షీట్లు సర్దుబాటు చేయలేకే ఈ సినిమా వదులుకొన్నా అంటోంది.. కాజల్. ఈ విషయమై కమల్ హాసన్‌కు కాజల్ సారీ కూడా చెప్పిందట. ఈ విషయాన్ని కమల్ కూడా లైట్‌గానే తీసుకొన్నాడు. వెంటనే మరో కథానాయిక కోసం అన్వేషణ మొదలుపెట్టేశాడు.అయితే కాజల్ ఈ ఆఫర్‌ని కాదనడానికి కారణం కాల్సీట్ల సమస్య కాదట. తన కంటే వయసులో
ముదిరిపోయిన కథానాయకుడితో జత కట్టడం కాజల్‌కి ఇష్టం లేదట. అందుకే కాల్షీట్ల సాకుతో ఈ సినిమా వదులుకొందని కోలీవుడ్ టాక్. ఇందులో కొంచెం నిజం కూడా ఉంది. ఎందుకంటే.. కాల్షీట్ల సమస్యలో ఇరుక్కొనేంత బిజీగా కాజల్ లేదిప్పుడు. ఎందుకంటే ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అలాంటప్పుడు కాల్షీట్ల సమస్య ఎందుకు వస్తుంది?