శేఖర్ కమ్ములకు మెగా ఫ్యామిలీతో వైరం ఎందుకు..?

Prasad
తెలుగు పరిశ్రమలో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల త్వరలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శేఖర్ మొట్టమొదటగా తీసింది డాలర్ డ్రీమ్స్ అనే సినిమా అయినా ఆనంద్ సినిమా శేఖర్ కు దర్శకుడుగా తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం శేఖర్ కు ఓవర్సీస్ లోనూ, ఎవన్ సెంటర్లలోనూ కొంత మంది ప్రముఖ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ ఉంది. దీనిని తీసుకు వచ్చింది ఆనంద్ సినిమా అనేది అందరికీ తెలిసిందే. కాగా, శేఖర్ కెరీర్ పరిశీలిస్తే ఎప్పడు మెగా ఫ్యామిలీ వైరం పెట్టుకోవడానికి తయారు ఉంటాడనిపిస్తుంది. చిరంజీవి సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా విడుదల సమయంలోనే ఆనంద్ సినిమాను విడుదల చేశాడు. పవన్ కళ్యాణ్ బంగారం సినిమా విడుదల సమయంలోనే తన గోదావరి చిత్రాన్ని రిలీజ్ చేశాడు. ఇప్పడు తాజాగా మరో మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ తో తలపడ్డానికి సిద్ధం అవుతున్నాడు. జులాయిగా అల్లు అర్జున్ వస్తున్న తరువాత తన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇలా మెగా ఫ్యామిలీకి పోటీగా విడుదల చేసిన శేఖర్ కమ్ముల సినిమాలన్నీ విజయవంతం అయ్యాయి. అయితే తన ’లీడర్‘ సినిమాను ఇందుకు భిన్నంగా విడుదల చేశాడు. ఆశించిన ఫలితాన్ని పొందలేక పోయాడు. దీంతో ఇలా మెగా హీరోలతో వైరం పెట్టుకోవడానికి శేఖర్ కమ్ముల ఇష్టపడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: