తాప్సి లెగ్గు మహిమా?
ఫుల్లు ఫాంలో ఉన్న కథానాయకులకు కూడా పరాజయాలు తెచ్చి పెట్టగల సమర్థురాలు ఈ ముద్దుగుమ్మ.అందుకే తాప్సిని ఐరన్ లెగ్ భామ అని సంభోదిస్తుంటారు చిత్ర పరిశ్రమలో. ఆ లెగ్గు మహిమ ఇప్పుడు "సాహసం" బృందానికి కూడా తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాని ఎంతకీ కష్టాలు వీడడం లేదు. అసలు వ్యాపారమే జరగడం లేదు. భారీ బడ్జెట్ తో సినిమాని తీశారు. టీజర్ హాలీవుడ్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకుంటున్నారు. ఆ ప్రభావం మాత్రం వ్యాపారం దగ్గర కనిపించడం లేదు. దీంతో సినిమా విడుదల వాయిదాల పద్దతిలో వెనక్కి వెళ్లిపోతూనే ఉంది.
మొదట మేలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత జూన్ అన్నారు. అది కూడా జరిగేలా కనిపించడం లేదు. మరి వచ్చే నెలైనా ఈ సినిమా బయటికొస్తుందో లేదో చూడాలి. గోపీచంద్, తాప్సి జంటగా నటించిన చిత్రమిది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. బి. వి. యస్.యన్. ప్రసాద్ నిర్మాత. విచిత్రం ఏమిటంటే ఐరన్ లెగ్గు అనే ముద్ర పడినా తాప్సి కి మాత్రం అవకాశాలు దక్కుతూనే ఉంటాయి. ఆ రహస్యం ఏమై ఉండొచ్చంటారూ?