సమంతకు బోర్ కొట్టేసిందట
అని అందరూ ముక్కున వేలేసుకొంటున్నా.. దానికీ ఓ కారణం ఉంది.ఇటీవల సమంత పిజ్జా అనే సినిమా చూసింది. ఈ థ్రిల్లర్ సినిమా సమంతకు బాగా నచ్చింది. అలాంటి కథ ఉంటే చెప్పండి. తప్పకుండా చేస్తా అని దర్శకులను అడుగుతోందట. చిన్న సినిమాల్లో పారితోషికం తక్కువ ఇస్తారు కదా? అంటే ``అన్ని సినిమాలనూ డబ్బుల కోసం చేయకూడదు
. ఒకవేళ ఆ సినిమా హిట్టయితే ఆ కెరీర్‌కే ప్లస్ కదా? ఆ తరవాత సినిమాల్లో పారితోషికం ఎలాగూ పెరుగుతుంది`` అని లాజిక్ తీస్తోంది.అసలు విషయం మరోటి కూడా ఉంది. ఎప్పుడూ పాటలు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం సమంతకు బోర్ కొట్టేసుంటుంది. అందుకే కొత్తగా ట్రై చేద్దాం అనుకొంటోంది. మరి సమంత కోరిక తీర్చేది ఎవరో చూడాలి.