శతమానం భవతిపై ఓ అభిమాని షాకింగ్ పోస్ట్..!

Chakravarthi Kalyan
ఈ సంక్రాంతికి ప్రధానంగా నాలుగు తెలుగు చిత్రాలు బరిలో దిగాయి. అందులో రెండు స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో అందరి దృష్టీ వాటిపైనే పడింది. అందులోనూ మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత తీస్తున్న 150 సినిమా ఖైదీ నెం 150 కావడం.. మరో స్టార్ హీరో బాలకృష్ణ వందో చిత్రం శాతకర్ణి కావడంతో అవి బాగా హైలెట్ అయ్యాయి. 


కానీ ఈ మధ్యలో శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి తక్కువ థియోటర్లలో విడుదలైనా మంచి ఫ్యామిలీ చిత్రం అన్న టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన ఓ అభిమానిపెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరూ చూడండి.. 


శతమానం భవతి అంత గొప్ప చిత్రం మళ్ళీ ఇప్పట్లో చూస్తాననే నమ్మకం లేదు. ప్రతి కొడుకు, కూతురు, అన్నా, తమ్ముడు, అక్క, మనుమడు, మనుమరాలు, భార్య, భర్త, అమ్మా, నాన్న చూసి తీరాల్సిన సినిమా ఇది. ఈ సినిమాని మిగతా వాటితో పోల్చుకోవడం అనవసరం. ఈ సినిమాకి పోటీ లేదు. ఈ సినిమాలో ఫలనాది బాగుంది అనటానికి లేదు. సినీ పరిభాషలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నింటా శిఖరాగ్రంలో ఉందీ సినిమా.



సినిమా అయిపోయాక కూడా ఎవరూ సీటుల్లో నుంచి లేవలేకపోతున్నారు. ఒక్క బండరాళ్లను తప్ప ప్రతి హృదయాన్ని స్పృశించే మలయమారుతం ఈ చిత్రం. ఈ సినిమాలో మనకి మనం కనపడతాము. మన పిల్లలు, మన అమ్మానాన్నలు కనపడతారు. చివరగా దయచేసి ఈ సినిమాను స్నేహితులతో కాదు. కుటుంబంతో మాత్రమే కలిసి చూడండి. అవకాశం ఉంటే అమ్మా,నాన్నలను తప్పక తీసుకువెళ్లండి... ఇదీ ఆ సందేశం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: