మహానటుడు ఎన్ టి ఆర్ సినిమాల్లోని సందేశాత్మక గీతాలు


నందమూరి తారక రామారావు అన్న పేరే తెలుగు వారికి తారక మంత్రం. వారి మదిలో పులకరింత తో కూడిన పలవరింత. తెలుగు తెలుగునేలపైనే కాదు భారత భూమిపైనే నందమూరి వేసిన ముద్ర అలాంటిది. ఆయన మనకు అందించిన గౌరవం అలాంటిది అట్లానే విడిచి వెళ్లిన ప్రతిష్ఠ అలాంటిది.  మన నటుల్లో ఆదినుండి మనల్ని అంటే తెలుగువారిని అంతగా ఆకట్టు కున్న నటుడు వేరొకరు కనిపించరు.


ఎన్టీఆర్ ఆహార్యం, ఆకర్షణ, దర్పం, వాగ్ధాటితో పాటు నటన, సినిమాలు ఒకెత్తయితే, ఆ సినిమాల్లోని గీతాలు మరోఎత్తు. ఆయన జీవితమే ఒక స్ఫూర్తి దాయకమైన ప్రభోదాత్మ క  చిత్రమైతే అందులో సందేశాత్మక గీతాలు ఎన్నో ఉన్నాయి. కథ ఏదైనా, ఇతివృత్తం ఏమైనా  అందులో ఏదో ఒక రీతిన ఓ సందేశాత్మక గీతాన్ని చొప్పించడం ఎన్టీఆర్‌ శైలి.  అందుకే ఆయన సినిమాల్లో అనేక సందేశాత్మక గీతాలుంటాయి.



 'పల్లెటూరు' సినిమాలోని "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా" అంటూ సాగే పాట తెలుగునాట ఇప్పటికీ వినిపిస్తుంది.

'శభాష్‌ రాముడు'లోని "జయంబు నిశ్చయమ్మురా." పాట ఈ నాటికీ ఎందరికో స్పూర్తినిస్తూనే ఉంది.

'గాలిమేడలు'లోని "మమతలు లేని మనుజులలో." గీతం ఎంతగానో ఆలోచింపజేస్తుంది.

'రక్తసంబంధం'లోని "మంచిరోజు వస్తుంది మాకు బతుకునిస్తుంది" పాట ఆశాభావాన్ని పెంపొందిస్తుంది.

'పాండురంగ మహాత్మ్యం'లోని "అమ్మా అని పిలిచినా."అన్న పాట చెడు మార్గం పట్టిన తనయునిలో మార్పు.  

'మంచి మనసుకు మంచి రోజులు'లోని కలవారి "స్వార్థం.. నిరుపేద దుఖం" మనసులను కలచి వేస్తుంది.

 'ఒకే కుటుంబం'లో అందరికీ "ఒక్కడే దేవుడు" అన్న పాటైనా,




 'మాదైవం'లో "ఒకే కుల ఒకే మతం" గీతమైనా ఆయనలోని ఆదర్శభావాలకు ఆ పాటలు ఉదాహరణలు.

'లవకుశ'లోని "ఏ నిమిషానికి ఏమి జరుగునో" అనే గీతం అన్ని కాలాలకు వర్తించే పాట.

ఎన్టీఆర్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన 'శ్రీకృష్ణ పాండవీయం'లోనూ "మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా"

గుడిగంటలు'లోని "జన్మమెత్తితిరా - అనుభవించితిరా" పాట నిరూపిస్తుంది.

'రాముడు – భీముడు'లోని "ఉందిలే మంచి కాలం ముందు ముందునా" పాట అయినా,



గుండమ్మ కథలో  “లేచింది నిద్ర లేచింది మహిళాలోకం" అని మహిళలను ఉత్తేజ పరచటం

 "దేశమ్ము మారిందోయ్‌ కాలమ్ము మారిందోయ్‌" పాట అయినా సందేశాలు వల్లించడమే.

'విశాలహృదయాలు'లోని "రండి రండి చేయికలపండి " పాట రైతుల అనుబంధం చాటుతుంది.

అలాగే 'మనుషులంతా ఒక్కడే'లోని "ఎవడిదిరా ఈ భూమి ఎవ్వడు రా భూస్వామి" పాటయినా,

 'రైతుబిడ్డ'లోని "దేవుడు సృష్టించాడు లోకాన్ని… మనిషి సృష్టించాడు తేడాలు" .పాటయినా,



'కలిసొచ్చిన అదృష్టం'లోని "పట్టండి నాగలి పట్టండి" పాట,

'చండశాసనుడు'లోని "దేశమంటే మట్టికాదోయ్‌" పాటయినా రైతులపక్షం నిలిచి, ఉత్సాహం కలిగించాయి. 

'తల్లా పెళ్ళామా?'లోని "తెలుగు జాతి మనది.. నిండుగల వెలుగు జాతి మనది".

దేశభక్తిని చాటేలా రూపొందిన 'బండిపంతులు' లోని "భారతమాతకు జేజేలు- బంగరు భూమికి జేజేలు". 

'సర్ధార్‌ పాపారాయుడు'లోని "ఒక యోధుడి మరణం శతవీరుల జననం" గీతం

'బొబ్బిలిపులి'లోని "జననీ జన్మభూమిశ్చ- స్వర్గాదసీ గరీయసీ" అన్న పాట.

'మేజర్‌ చంద్రకాంత్‌' లోని "పుణ్యభూమి నాదేశం నమో నమామి" అన్న పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. 



గీతాల్లోని భావం మామూలుది కాదు.  మనిషి పరివర్తన చెందే క్రమంలో తన తప్పులు తాను తెలుసుకుంటే ఎలా ఉంటుందో ఆ సినిమాలు చూస్తే అర్ధమౌతుంది. అలాగే దేశభక్తి, జనంలో సమస్యల పట్ల మేలుకొలుపు, ప్రజల్లో ఐకమత్యం ఆయన గీతాల్లో ద్వారా ప్రభోదించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: