ఎన్టీఆర్ తో ఆ ఇద్దరు :
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ జై లవ కుశ టైటిల్ ప్రచారం లో ఉంది. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్న తారక్ సినిమాలో హీరోయిన్స్ ను కూడా ముగ్గురిని తీసుకుంటున్నారట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ అయినట్టు టాక్. ఇక మూడో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి. డిఫరెంట్ కథతో రాబోతున్న ఈ సినిమా తారక్ ఫ్యాన్స్ కు మంచి విందు భోజనంగా ఉంటుందని అంటున్నారు.
చెలియా మూవీ రిలీజ్ ఎప్పుడంటే :
మణిరత్నం డైరక్షన్ లో కార్తి అదితి ఆర్య నటిస్తున్న సినిమా చెలియా. ఈ సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. తెలుగులో కార్తి మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. అందుకే తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ప్రేమకథల్లో తన మార్క్ చూపించే మణిరత్నం ఈ చెలియా సినిమాను కూడా అదే రేంజ్ లో తెరకెక్కించారు. సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. సో దిల్ రాజు చేతిలో మరో మంచి సినిమా పడిందన్నమాట.
ఎంగేజ్మెంట్ వెన్యూ తెలిసింది :
అక్కినేని నాగచైతన్య, సమంతల ఎంగేజ్మెంట్ ఈ నెల 29న జరుగుతుందని తెలిసిందే. అయితే ఇప్పటిదాకా వెన్యూ ఎక్కడ అన్నది తెలియలేదు. ఇప్పుడు అది కూడా తెలిసిపోయింది. పార్క్ హయత్ లో గ్రాండ్ గా ఈ ఎంగేజ్మెంట్ జరుగనున్నదట.
కొద్దిరోజులుగా ప్రేమలో మునిగితేలుతున్న చై సమంతలు వారి ప్రేమను బయటపెట్టడానికి చాలా సమయం పట్టింది. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి డేట్ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
విజయ్ ఆంటోని యముడు రిలీజ్ డేట్ :
బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న విజయ్ ఆంటోని రీసెంట్ గా బేతాళుడుతో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం నటిస్తున్న యమన్ సినిమాను తెలుగులో యముడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 24 మహాశివరాత్రి రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బిచ్చగాడు కన్నా పెద్ద హిట్ అయ్యే అవకాశాలున్నాయని చిత్రయూనిట్ చెబుతుంది. సినిమా ప్రమోషన్స్ కూడా డైరెక్ట్ మూవీ లానే చేయాలని ఫిక్స్ అయ్యారు తెలుగు నిర్మాతలు.