ఆ హీరోని దెబ్బకొట్టిన గోపిచంద్‌

E. Rama Krishna
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు మంచి చిత్రాలను తెరకెక్కిస్తారో...ఆ దర్శకులు చుట్టు హీరోలు ఉంటారు. అలాగే హీరోలు సైతం మంచి కథలు ఎవరి దగ్గర ఉంటాయో...ఆ డైరెక్టర్స్ ని ఏదొక విధంగా లాగేసుకోవటం జరుగుతుంది. ఆ విధంగానే తాజాగా టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్ విషయంలో ఇద్దరు హీరోల మధ్య కాస్త కాంపిటీషన్ ఎదురయింది.


గతంలో మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా అయిన ‘రాబిన్ హుడ్’ ని ప్రకటించడం జరిగింది. ‘రాబిన్ హుడ్’ సినిమా కథ దాదాపు సెట్స్‌ పైకి వెళ్ళినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే రవితేజ ఈ సినిమాను పక్కనబెట్టి ‘రాజా ది గ్రేట్’ సినిమాని ప్రారంభించాడు. ఇక రాబిన్ హుడ్‌తో దర్శకుడిగా పరిచయం అవుదామనుకున్న చక్రిని వెంటనే మరో టాప్ హీరో అయిన గోపిచంద్ అక్కున చేర్చుకున్నాడని తెలుస్తుంది. 


‘రాబిన్ హుడ్’ కథ గురించి తెలిసిన గోపిచంద్‌...ఈ కథలో తను నటిస్తానని డైరెక్టర్ చక్రికి మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ‘రాబిన్ హుడ్’ కథ బాగుండటంతో గోపిచంద్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’ సినిమాలో గోపిచంద్ హీరోగా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీ ఉండడంతో త్వరలోనే గోపిచంద్‌ ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ని ఇవ్వనున్నాడని అంటున్నారు.


అయితే రవితేజ మాత్రం ‘రాబిన్ హుడ్’ కథని కొంత కాలం తరువాత చేద్దాం అని చక్రికి చెప్పాడంట. దీంతో డైరెక్టర్ కి ఆలస్యం జరుగుతుండటంతో గోపిచంద్ కి ఇచ్చిన ఆఫర్‌ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవితేజ ఆగమని డైరెక్టర్ చక్రితో చెప్పినప్పటికీ...గోపిచంద్‌ లీడ్‌ తీసుకొని చక్రీతో ముందుకు వెళ్ళటంతో ఇది హాట్ టాక్స్ గా మారింది. మొత్తంగా ‘రాబిన్ హుడ్’ కథలో గోపిచంద్‌ రోల్ పవర్ఫుల్ గా ఉంటుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: