రకుల్ కీర్తి లకు మెహరీన్ కౌర్ టార్చర్ !

Seetha Sailaja
ప్రస్తుతం టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్స్ లోటు విపరీతంగా పెరిగి పోతోంది.  కాజల్ తమన్నా అనుష్కలు సీనియర్ హీరోయిన్స్ గా మారిపోతే శ్రుతిహాసన్ ఎప్పుడో కానీ తెలుగు సినిమాల పై మనసు పెట్టడం లేదు. దీనితో టాలీవుడ్ దర్శక నిర్మాతలకు హీరోలకు రకుల్ కీర్తి సురేశ్ అనుపమ పరమేశ్వరన్ లు తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. 

ఇలాంటి పరిస్థుతులలో వీరిద్దరు అడుగుతున్న పారితోషికాలు కోరుతున్న కోరికలు తీర్చవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి.  అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలమందికి అందుబాటులో లేని నేపధ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి లేటెస్ట్ గా మెహరీన్ కౌర్ పై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

హీరో నాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రి ఇచ్చిన మెహరీన్ కు ప్రస్తుతం అనూహ్యంగా టాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. ఆమె అటు గ్లామర్ కు ఇటు నటనకు రెండిటికీ సరిపోతుంది అన్న అభిప్రాయం రావడంతో రవితేజ హీరోగా తెరకెక్కనున్న’రాజా ది గ్రేట్‌’లో మెహరీన్‌ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 

అలాగే సాయిధరమ్‌ ‘తేజ్  సరసన ‘జవాన్‌’ సినిమాలో ఈమెను హీరోయిన్ గా బుక్ చేసారు. ఇది చాలదు అన్నట్లుగా ఎన్టీఆర్ బాబీ లేటెస్ట్ మూవీకి కూడా ఈమెను హీరోయిన్ గా పెట్టుకోవడం ఖాయం అని అంటున్నారు. ఇవే కాకుండా మరొక మూడు సినిమాలలో మోహరీన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 

దీనికితోడు బాలీవుడ్ లో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిల్లౌరీ’ లో సెకెండ్ హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ఇంత వేగంగా ఈమె క్రేజ్ ఇలా పెరిగి పోవడానికి ఈమె తక్కువ పారితోషికానికి రావడమే అని అంటున్నారు. ఈ సంవత్సరం అత్యంత బిజీగా మారబోతున్న ఈ హీరోయిన్ నటిస్తున్న సినిమాలలో కొన్ని హిట్ అయినా వచ్చే సంవత్సరం రకుల్ కీర్తి సురేశ్ లకు గడ్డు కాలమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: