ప్రపంచ సినిమాపై తెలుగు సినిమా ఎటాక్..!

shami
తెలుగు సినిమా పరిది పెంచుతూ ఏకంగా భారత సినిమా సత్తానే చాటే విధంగా తెలుగు దర్శక నిర్మాతలు తమ సినిమాలను చేస్తున్నారు. రిలీజ్ అయ్యే వందల కొద్ది సినిమాల్లో తెలుగు సినిమా అంటే ఇది అని కొత్త ప్రయత్నంగా చెప్పే ప్రయోగాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా అలాంటి ప్రయత్నమే ఘాజీ మూవీ. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు సినిమానే.  


అయితే ఇది కచ్చితంగా సిని ప్రియులను అలరిస్తుందని హింది తమిళంలో కూడా రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా యునానిమస్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కెకె.మీనన్, అతుల్ కులకర్ణి కూడా నటించారు. తెలుగు సినిమా అంటే మూస థోరని సినిమాలే అన్న భావన నుండి తెలుగులో సినిమా వస్తుంది అంటే అది ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అన్న భయం కలిగేలా చేశారు మన దర్శక నిర్మాతలు.  


చాలా వరకు ఘాజి తెలుగు సినిమా కాదేమో అనుకునే ఆడియెన్స్ ఉన్నారు. తెలుగు దర్శకుడు తీసిన సినిమానే ఈ ఘాజి. సినిమా మొత్తం సబ్ మెరైన్ లో తీసి దర్శకత్వ ప్రతిభ చాటాడు. ఇక తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదు ప్రయోగం చేస్తూ ప్రపంచ సినిమాకు పోటీ ఇస్తుందని ముక్త కంఠంతో చెప్పొచ్చు. దానికి రానా ఘాజి ఒక ఉదాహరణ. ఇలా చేస్తూ పోతే మన సినిమాకు అకడెమీ అవార్డులు సైతం వచ్చే అవకాశం లేకపోలేదు. మరి మారుతున్న ఈ మార్పు ప్రేక్షకులు కూడా తమ సహకారం అందించి ఇలాంటి సినిమాలను కమర్షియల్ హిట్ చేస్తారని ఆశిస్తున్నారు సిని విమర్శకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: