ఈసారి బాలకృష్ణను వాడేశాడు!
ఈ సినిమాలో పవన్‌తో పాటు బాలయ్యనీ వాడేశారు. ఓ సీన్లో రవితేజ బాలకృష్ణలా స్పీచ్ ఇస్తాడు. అంటే... ఏమాత్రం అర్థం పర్థం లేని మాటలు, సెంటెన్స్ కంటిన్యుటీ లేకుండా, ఎక్కడో మొదలెట్టి, ఇంకెక్కడికో వెళ్లిపోయి.. అలా నోటికి ఏది వస్తే అలా మాట్లాడేశాడు. విత్ బాలకృష్ణ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ..! మరి దీనికి బాలయ్య ఫ్యాన్స్ ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
��
రవితేజ-బాలకృష్ణ మధ్య ఏవో గొడవలు వచ్చాయని,రవితేజని బాలకృష్ణ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని అప్పట్లో పరిశ్రమలో గాసిప్స్ వినిపించాయి. ఫ్లాష్ బ్యాక్ గుర్తుపెట్టుకొనే రవితేజ రివైంజ్ ఈ రూపంలో తీర్చుకొన్నాడని సినీ జనాలు చెప్పుకొంటున్నారు.