సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ ఉన్నప్పుడే తమ హవా కొనసాగిస్తుంటారు..ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ అవుతూనే ఉన్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా గ్లామర్ ఉన్నపుడే డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా మారిపోతున్నారు టాలీవుడ్ హీరోయిన్స్. గ్లామర్ ఇండస్ర్టీలో ఆఫర్స్ తగ్గుతున్న వేళ ఐటెమ్‌సాంగ్ వైపు ఫోకస్ పెట్టడం మనం చూస్తూనే వుంటాం. ఇప్పటికే బాలవుడ్ లో టాప్ హీరోయిన్లు సైతం హాట్ హాట్ గా ఐటమ్ సాంగ్స్ లో మోప్పిస్తున్నారు.
ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా కొనసాగుతుంది. ఈ జాబితాలోని కాజల్, శృతిహాసన్, తమన్నా ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది పేర్లు వినిపిస్తాయి. ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తుంది అందాల భామ రకూల్ ప్రితిసింగ్. ప్రస్తుతం టాప్ హీరోల సరసన నటిస్తున్న ఈ అమ్మడు బాబీ డైరెక్షన్లో ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రంలో ఐటెమ్‌సాంగ్ చేసేందుకు రకుల్ ఓకే చేసినట్టు సమాచారం.
డైరెక్టర్ ఆమెని అప్రోచ్ కావడం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతాగ్యారేజ్‌లో ‘నేను పక్కా లోకల్’ అంటూ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ కనువిందు విషయం తెలిసిందే. ఈ పాటతో కాజల్ రేంజ్ ఒక్కసారే పెరిగిపోయింది. డబ్బుకి డబ్బు ఎంటైర్ సినిమాలో నటించాల్సిన అవసరం ఉండదు..అందుకే హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కి ఒకే చెప్పేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.