ప్రభాస్ గ్లామర్ సీక్రెట్ ఇదే...!

K Prakesh
మిర్చి సినిమా సూపర్ హిట్ తరువాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా అమ్మాయిల ‘డార్లింగ్’ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. మిర్చి సినిమాలో ప్రభాస్ మేకప్, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అన్నీ ఇలా అతడిని అమ్మాయిల డార్లింగ్ గా ఆకాశంపై కూచ్చో పెట్టాయి. ఇక రాబోతున్న ‘బాహుబలి’ ఇమేజ్ ప్రభాస్ ను టాలీవుడ్ నెంబర్.1 స్థానానికి దగ్గరగా తీసుకొని వెళ్ళిపోతోంది.

 ప్రస్తుతం అమ్మాయిల మనసు దోచుకుంటు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఫ్ సౌత్ ఇండియా గా పేరుగాంచిన ప్రభాస్ గ్లామర్ సీక్రెట్ ను తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కాని ప్రభాస్ కు వచ్చిన ఈ గ్లామర్ కేవలం ఒక్కరోజుతోనో లేదా అతని ఆరడుగుల పొడుగుతో కూడుకున్న సిక్స్ ప్యాక్ బాడీ తోనో వచ్చింది కాదట. ప్రభాస్ తన చిన్నతనం నుండీ పఫ్స్ విపరీతంగా తినే అలవాటు ఉందట. నార్మల్ ఫుడ్ కంటే ఎక్కువగా ప్రభాస్ రకరకాల పఫ్స్ తింటాడట. తన చిన్నతనంలో అయితే తన స్కూల్ బ్యాగ్ లో ఈ పఫ్స్ ను ఎక్కువగా పెట్టుకొని తన క్లాస్ రూమ్ లో కూడా తెగ తినేవాడట ప్రభాస్. ఇదే తన గ్లామర్ సీక్రెట్ అని ప్రభాస్ ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ప్రభాస్ గ్లామర్ సీక్రెట్ తెలిసిపొయింది కాబట్టి ప్రభాస్ లా అమ్మాయిలకు డార్లింగ్ లా మారాలి అనుకుంటున్న నేటి యువతరం కూడా ఇక ప్రభాస్ లాగే ఎక్కువగా పఫ్స్ తింటే ప్రభాస్ లా గ్లామరస్ గా మారిపోతారేమో. ప్రభాస్ అంతటి అందం వచ్చినా రాకపోయినా బేకారిలకు మాత్రం మంచి బిజినెస్ ఈ వార్త ద్వారా వచ్చేలా కనిపిస్తోంది.  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: