హాట్ న్యూస్ గా మారిన అఖిల్ మాజీ ప్రేయసి పెళ్ళి వార్తలు ?

Seetha Sailaja
నిన్న అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవ వార్తలతో మీడియా హడావిడి చేసిన నేపధ్యం తెలిసిందే. ఈ వార్తలు ఇలా హడావిడి చేస్తూ ఉండగానే అఖిల్ మాజీ ప్రేయసి శ్రియా భూపాల్ పెళ్ళికి సంబంధించిన గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అఖిల్ తో శ్రియా భూపాల్ నిశ్చితార్ధం జరిగిన తరువాత వీరిద్దరి పెళ్ళి గురించి అందరు ఎదురు చూస్తూ ఉంటే షాక్ ఇస్తూ వీరి ఎంగేజ్ మెంట్ రద్దు వార్తలు టాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపిన విషయం అందరికీ తెలిసిందే.

ఈవార్తలు ఇలా బయటకు రావడంతో షాక్ కు గురైన అక్కినేని కుటుంబ సభ్యులు ముఖ్యంగా నాగార్జున అదేవిధంగా అఖిల్ కొద్దిరోజుల పాటు మీడియాకు దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు అంటే అఖిల్ పెళ్లి రద్దు వార్తలు వారికి ఎంత షాక్ ఇచ్చాయో అర్ధం అవుతుంది. ఈ షాక్ నుండి తేరుకున్న అఖిల్ తన రెండవ సినిమాను నిన్న మొదలు పెడితే అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత శ్రియా ఎన్నారైతో తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పుడు వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

ఈమధ్యనే  శ్రేయా తన ఫ్యాషన్ డిజైనింగ్ పనులతో బిజీగా ఉన్న నేపధ్యంలో ఆమె కుటుంబ సభ్యులు చూపించిన  ఎన్నారై పెళ్లి సంబంధానికి ఆమె మరొక మాట మాట్లాడకుండా ఒప్పుకోవడం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి.  అఖిల్ రెండో సినిమా ప్రారంభమైన రోజే ఈ వార్త యాదృచ్చికంగా  వచ్చాయా ? లేదంటే వ్యూహాత్మకంగా శ్రియా కుటుంబ సభ్యులు అక్కినేని ఫ్యామిలీకి ఒక షాక్ ఇవ్వడానికి ఇలాంటి వార్తలు క్రియేట్ చేసారా ? అన్న అనుమానాలు చాల మంది వ్యక్త పరుస్తున్నారు.  

తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలోనే అధికారికంగా శ్రేయాభూపాల్ పెళ్లి వార్త వినవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాషన్ డిజైనర్‌గా ఎంతో పేరు గాంచిన శ్రేయా భూపాల్‌కు ఆలియా భట్, శ్రద్ధాకపూర్ లాంటి వారికి డ్రెస్ డిజైనింగ్ చేసిన పేరు ఉంది. టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లకు కూడ డ్రెస్ డిజైన్ చేసిన శ్రియా గతంలో తాను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ తో గతంలో అఖిల్ తో ఒక ఫోటో షూట్ ను కూడా తీసింది. 

ఎంతో అన్యోన్యంగా హడావిడి చేసిన ఈ ప్రేమ జంట ఎందుకు విడిపోయింది అన్న విషయమై ఇప్పటికీ అక్కినేని కుటుంబం ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అందరికీ సప్సేన్స్ గా మారిన విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: