నాగచైతన్యతో పెళ్ళి ఎంగేజ్ మెంట్ జరిగిన తరువాత సినిమాలు మానివేస్తుంది అని అనుకున్న సమంత తన సినిమాల వేగాన్ని మరింత పెంచి ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంతతో నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో ప్రచారంలో ఉంది.
ఇప్పటి వరకు ఈసినిమాలో చరణ్ చెవిటి వాడిగా కనిపించబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చెవుడు పూర్తిగా కాకుండా వినిపించీ వినబడని రేంజ్ లో ఈ చెవుడు ఉంటుందని ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి బయట వినిపిస్తున్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.
దీనికితోడు దీనిని మించిన మరొక ప్రయోగం ఈసినిమాలో సుకుమార్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాలో నటిస్తున్న సమంతది ‘మూగ’ పాత్ర అన్న లేటెస్ట్ ట్విస్ట్ బయటకు వస్తోంది. ఒక పల్లెటూరి ప్రేమ కథగా 1980 ప్రాంతంనాటి పరిస్థుతుల నేపధ్యంలో తీస్తున్న ఈసినిమా కొంత వరకు గతంలో విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమా ఛాయలలో ఉంటుంది అన్న ప్రచారం కూడ జరుగుతోంది.
దీనితో సుకుమార్ చరణ్ సమంతల పై పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం అయిన నేపధ్యంలో రామ్ చరణ్-సమంత మధ్య వచ్చే ఒక పాటతో షూటింగ్ స్టార్ట్ చేశారు అని వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈమూవీలో చరణ్ గుబురు గడ్డంతో పూల చొక్కా వేసుకొని, లుంగీ కట్టుకొని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో కనిపించ బోతున్నాడు అంటూ మరికొందరు వార్తలు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. ఏది ఏమైనా సుకుమార్ చరణ్ సమంతల పై చేస్తున్న ప్రయోగాల వార్తలు విని మెగా అభిమానులు తీవ్ర టెన్షన్ పడుతున్నట్లు టాక్..