బి రెడీ తారక్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..!

shami
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ మూవీ నుండి తారక్ ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ అవనుందట.


ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద అంచనాలను పెంచేలా చూస్తున్నారు. సినిమాలో తారక్ నెగటివ్ రోల్ కూడా చేస్తారని టాక్. పవర్ హిట్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అందుకున్న బాబి మళ్లీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా జై లవ కుశ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. సినిమా కోసం హాలీవుడ్ మేకప్ టెక్నిషియన్స్ ను వాడుతున్న బాబి ఫస్ట్ లుక్ తోనే సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.   


అసలైతే ఆగష్టు నెలలో రిలీజ్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్ షూటింగ్ లేటవడం వల్ల సెప్టెంబర్ కు రిలీజ్ వాయిదా వేసుకున్నారు. సినిమా గురించి అంతా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న చిత్రయూనిట్ కచ్చితంగా ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ హిట్ అందించాలనే చూస్తున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: