ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామని అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ మొదట్లోనే లిప్ లాకులతో రచ్చ చేసింది. గిల్లి అనే కన్నడ సినిమాతో సిని తెరంగేట్రం చేసిన రకుల్ బాలీవుడ్ లో యారియాన్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక ఆ సినిమాలో హిమాన్ష్ కొహ్లితో అదరచుంభనాలతో అదరగొట్టింది రకుల్.
ఇప్పుడు టాలీవుడ్ లో లిప్ లాక్ అంటే స్టైల్ కొడుతున్న అమ్మడు ఆల్రెడీ బీ టౌన్ ఆడియెన్స్ కు లిప్ లాక్ రుచి చూపించింది. ఆ సినిమాలో నిమిషానికి పైగా లిప్ లాక్ సీన్స్ లో రెండు మూడింటిలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అని అందరు అనుకుంటారు కాని ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా కెరటం.
సిద్ధార్థ్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన ఆ సినిమా తర్వాత మరళ ఓ తమిళ హింది సినిమాలో నటించిన రకుల్ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత అమ్మడి కెరియర్ స్పీడందుకుంది. తెలుగులో షార్ట్ టైంలో సూపర్ క్రేజ్ దక్కించుకున్న రకుల్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కేవలం కిక్-2 లో రవితేజతో తప్ప మిగతా హీరోలతో లిప్ లాక్ చేయలేదు.
ఇక ప్రతి సినిమాలో తన మార్క్ గ్లామర్ షోతో అదరగొట్టే అమ్మడు తెలుగులో కూడా లిప్ లాకులు ఎప్పుడు చేస్తుందో చూడాలి. ఎంతైనా బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ముద్దులు కురిపించిన రకుల్ తెలుగులో ఆ ఇమేజ్ రాకుండా జాగ్రత్తపడుతుంది. టాప్ రేంజ్ లో ఉంది కనుక ఇప్పుడు రకుల్ ఏం చేసినా చెల్లుతుంది.