సన్నీ కావాలంటే ముంబాయ్ కి రావాల్సిందే

frame సన్నీ కావాలంటే ముంబాయ్ కి రావాల్సిందే

E. Rama Krishna
కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సన్నీలియోన్ ఇండస్ట్రీకి ఎంట్రి వచ్చినప్పటి నుండి టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. అప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపుతున్న ఐటెం బ్యూటీలు అంతా సన్నీలియోన్ దెబ్బకి ఫేడ్ అవుట్ అయ్యారు. దీంతో సన్నీలియోన్ నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

అయితే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సన్నీలియోన్ క్రేజ్ ని ఫుల్ గా ఉపయోగించుకుంది. మ్యాగ్జిమం సన్నీలియోన్ ని ఏ విధంగా చూపించాలో...ఎన్ని యాంగిల్స్ తన అందాలను ప్రేక్షకుల ముందు ఉంచాలో...అంత వరకూ బాలీవుడ్ మేకర్స్ చూపించారు. ఇక ఈ మధ్య కాలంలో సన్నీలియోన్ హావా కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే సన్నీలియోన్ మరో ప్లాన్ వేసింది.

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా ఇతర రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఫోకస్ చేయాలని చూసింది. అందులోని భాగంగానే సన్నీలియోన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తుంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలను సన్నీలియోన్ చేసింది. ఈ బ్యూటీ తాజాగా రాజశేఖర్‌ చిత్రం ‘పి.యస్‌.వి.గరుడ వేగ 126.18ఎం’లో ఓ సాంగ్ లో డ్యాన్ చేసింది.

ఈ పాటను ముంబైలో చిత్రీకరించారు. అలాగే గతంలో మంచు మనోజ్‌ నటించిన ‘కరెంట్‌తీగ’లో టీచర్‌గా నటించారు. అయితే సన్నీలియోన్ ఎటువంటి షూటింగ్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ముంబాయ్ వెళ్ళాల్సిందే. ముంబాయ్ లొకేషన్స్ లో షూటింగ్ పెట్టుకుంటేనే సన్నీలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. అందుకే ఈ బ్యూటీ సౌత్ మేకర్స్ కి ముందుగానే ముంబాయ్ లో షూటింగ్ అంటేనే నా దగ్గరకి రండి అని గట్టిగా చెబుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: