అభిమానులు ఫిక్స్ అయ్యారు..అసలు విషయం చెప్పేశాడు
ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తరువాత రజనీకాంత్ పెట్టిన ఈ చర్చా కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి రజనీకాంత్ సైతం ఆశ్ఛర్యపోతున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎన్నాళ్లగానో ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా రజనీకాంత్ ను పార్టీల్లోకి ఆహ్వానించాయి.
కానీ రజనీ మాత్రం ఎప్పటికప్పుడు ఆ అంశాన్ని తోసిపుచ్చుతూ వచ్చారు. ఈ విషయంపై రాజకీయాల్లోకి రంగ ప్రవేశం ఎప్పుడు అనేది దేవుడి చేతుల్లో ఉందని, తానెప్పుడూ నిజాయితీగానే పనిచేస్తానని అన్నారు. అయితే కొంత మంది అభిమాన సంఘాలకి మాత్రం రజనీకాంత్ క్లియర్ గా సంకేతాలను ఇచ్చారని అంటున్నారు. తను కచ్ఛితంగా ఈసారి ఎలెక్షన్స్ లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడతాడని చెప్పారంట.
ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలను చేస్తున్నప్పటికీ…ఎలక్షన్స్ టైంకి మూవీలను పక్కన పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే రజనీకాంత్ వ్యక్తిగత టీం.. రాజకీయ పార్టీకి అవసరమైన వనురులను ఏ విధంగా తెచ్చుకోవాలి అన్నదానిపై దృష్టిపెట్టారని అంటున్నారు. మొత్తంగా రజనీకాంత్ అభిమానులకి అసలు విషయం చెప్పటంతో…ఫ్యాన్స్ సైతం రజనీకాంత్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం అని అంటున్నారు.