‘కేశవ’ హిట్టా..ఫట్టా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.  స్వామి రారా మొదలు కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విభిన్నమైన స్టోరీలను ఎంచుకుంటూ సక్సెస్ బాటపడ్డాడు. సమ్మర్ సందర్భంగా  సుధీర్‌వర్మ డైరెక్షన్‌లో ఈ హీరో నటించిన ‘కేశవ’ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజైంది.  ఈ సినిమాపై నిఖిల్ భారీ గానే ఆశలు పెట్టుకున్నట్లు ఈ మద్య ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు.

 ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే నిఖిల్ ఈ సారి కూడా కొత్త యాంగిల్ లో కనిపిస్తాడట.   సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ఇక కేశవ రన్ టైం రెండు గంటల లోపే సుమా ! చాలా తక్కువ రన్ టైం ఉంది కాబట్టి తప్పకుండా సినిమాకు మంచి హెల్ప్ అవుతుంది.  ఈ చిత్రానికి సంబంధిచి టీజర్ లో మంచి సస్పెన్స్ కొనసాగుతూ అడియన్స్ కి సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా చేసింది.  

ఇక కథ విషయానికి వస్తే..చిన్నతనంలో జరిగిన ఓ కారు యాక్సిడెంట్‌లో పేరెంట్స్‌ని పోగొట్టుకున్న కుర్రాడు మనసు ఎలా గాయపడింది..తనకు పరిచయమైన అమ్మాయి చిన్న నాటి స్నేహితురాలని ఎలా గుర్తుపట్టాడు.  తర్వాత వారి మద్య కొనసాగిన ప్రేమ..వరుసగా జరుగుతున్న పోలీసుల హత్యల్లో హీరో ప్రమేయం ఉందన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేసింది.  అసలు హీరో పోలీసులను చంపడానికి..కారు యాక్సిడెంట్ కి మద్య ఉన్న సంబంధం ఏంటీ అనే అంశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు.  

ఇక నటన పరంగా నిఖిల్, రూతూ, నిషా చాలా బాగా చేశారు.  వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాడు.  మొత్తానికి సినిమా పై ఇప్పటి వరకు మిశ్రమ స్పందన వచ్చినా ఎక్కువ శాతం కొత్త అనుభూతి పొందినట్లు ఆడియన్స్ చెబుతున్నారు.  మరి రేపటి వరకు సినిమా పై పూర్తి అంచనాలు వేయాలని కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూడాలని..అసలు సినిమా హిట్టా..ఫట్టా అనేది రేపటి వరకు తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: