బాహుబలి -3 రాక తప్పదు:శోబు యార్లగడ్డ

frame బాహుబలి -3 రాక తప్పదు:శోబు యార్లగడ్డ

Image result for bahubali beautiful images


దర్శక దిగ్గజం రాజ‌మౌళి వెండి తెర‌కెక్కించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబ‌లి ది కంక్లూజన్ చిత్రం భారతీయ చలన చిత్ర చరిత్రలను తిరగరాస్తూ నూతన లక్ష్యాలను నిర్దేశిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 28న విడుద‌లైన ఈ చిత్రం మూడు వారాల‌లో 1500 కోట్ల వసూళ్ళు సాధించి దేశ, విదేశ చలన చిత్ర రంగా లన్నింటికి పెద్ద షాకే ఇచ్చింది. 


రానున్న కొద్ది రోజుల‌లో 2000 కోట్లు కూడా సాధిస్తుంద‌ని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. అయితే బాహుబ‌లి-3 అంటే మూడో పార్ట్ నిర్మాణానికి అవకాశం ఉందా లేదా అనే అంశంపై కొన్నాళ్ళుగా రసవత్తర చ‌ర్చ‌లు అటు సినిమా రంగములో ఇటు ప్రజల్లో జ‌రుగుటూనే ఉన్ది. దీనిపై మొదత చిత్ర యూనిట్ పూర్తిగా క్లారిటీ ఇవ్వ‌క‌పోగా, పరోక్షంగా ఏవో ఫీలర్లు ఇస్తూ ప్రేక్షకులను సందిగ్ధంలో ప‌డేస్తున్నారు. 

Image result for shobu yarlagadda

కాని బాహుబ‌లి-2 చిత్రం సినిమా చివ‌రిలో ఇచ్చిన చిన్న క్లూ బాహుబ‌లి-3 ఉంటుంద‌నే ఆశ అభిమానుల‌లో చిగిర్చింది. ఇక తాజాగా చిత్ర నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ తన ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ - బాహుబ‌లి 3 సినిమా వ‌స్తుంద‌నే ఆశలకు మరింత‌ ఆజ్యం పోసింది. "ఒకసారి జరిగింది రెండవసారి జరగదు. కానీ రెండుసార్లు జరిగింది మూడవసారి ఖచ్చితంగా జరుగుతుంది" అనే ప్రసిద్ద నానుడుని శోభు యార్ల‌గ‌డ్డ ట్వీట్ చేయ‌డంతో బాహుబ‌లి-3 చిత్రం ప‌క్కాగా వస్తుందని అభిమాన ప్రేక్షకులు భావిస్తున్నారు. మ‌రి దీనిపై పూర్తి సమాచారాన్ని ఎప్పుడు ఇస్తారో చూడాలి. 


Shobu Yarlagadda‏Verified account @Shobu_  5h5 hours ago
Everything that happens once can never happen again. But everything that happens twice will surely happen a third time! From"The Alchemist"


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: