సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం ఎన్నో సంచలనాలు, రికార్డులు సృష్టిస్తుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని కలెక్షన్లు ‘బాహుబలి 2’ కి వచ్చాయి..వస్తున్నాయి. తెలుగు చిత్రమే అయినా ప్రాంతీయ చిత్రంగా ఎన్నో రికార్డులు సృష్టించడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ సినిమాపై ఎంతో మంది సెలబ్రెటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేందుకు ప్రబాస్, రాజమౌళిపై ఎన్నో విమర్శలు చేసిన బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ బాహుబలి 2 కలెక్షన్ల సునామీ చూసి క్షమాపణలు కోరారు.
అలాంటి సినిమా కలెక్షన్లపై ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు మాత్రం అసలు బాహుబలి 2 ఎలాంటి రికార్డులు నమోదు చేయలేదని అసలు నా సినిమా వసూళ్ల తో పోల్చితే బాహుబలి ఓ సినిమానేనా ? అంటూ విమర్శలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరా అనుకుంటున్నారా.. '' గదర్ '' ఏక్ ప్రేమ్ కథ చిత్రం దర్శకుడు అనిల్ శర్మ. 2001 లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన '' గదర్ '' ఏక్ ప్రేమ్ కథ చిత్రం ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే అప్పట్లో 260 కోట్లు సాధించి సంచలనాలు సృష్టించిన ఈ సినిమా టికెట్ రేట్ చాలా తక్కువ అని అందుకే ఆ సమయంలో నా సినిమా సాధించిన హిట్ పెద్ద హిట్ అని అంటున్నాడు.బాహుబలి 2 సాధిస్తున్న విజయాలు చూసి మొదటి నుంచి బాలీవుడ్ కుల్లుకుంటుందన్న విషయం మరోసారి బయట పడింది.
నా సినిమాని పోల్చుకుంటే ఇప్పటి లెక్కల ప్రకారం అయిదు వేల కోట్ల సినిమా అందుకే బాహుబలి 2 గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని అంటున్నాడు .మొత్తానికి బాలీవుడ్ వాళ్ళు బాహుబలి 2 విజయాన్ని జీర్ణించుకోవడం లేదని దీన్ని బట్టి అర్ధం అవుతోంది .