హాట్ టాపిక్ గా మారిన అనసూయ మరో ప్రయత్నం !

Seetha Sailaja
జబర్దస్త్ కార్యక్రమంతో క్రేజ్ సంపాదించుకున్న అనసూయ ఆ క్రేజ్ ను కొనసాగిస్తూ బుల్లితెర పై అనేక కార్యక్రమాలను హోస్ట్ చేస్తోంది. మరొకవైపు తనకు ఏర్పడ్డ క్రేజ్ ను అవకాశాలుగా మార్చుకోవడానికి సినిమాలలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈమెకు ఉన్న క్రేజ్ రీత్యా కొన్ని అవకాశాలు కొందరు ఇస్తున్నా ఆమె పారితోషిక వార్తలు విని చాలామంది దర్శక నిర్మాతలు అనసూయ పేరు చెపితే ప్రస్తుతం భయపడిపోతున్నారు అన్న టాక్ ఉంది.

అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా అనసూయ మరింత వేగంగా సోషల్ మీడియాలో తన హడావిడిని కొనసాగిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో సమ్మర్ ను ఎంజాయ్ చేస్తూ ఉదయ్ పూర్ లోని ఒక స్విమింగ్ పూల్ లో ఈత కొడుతూ సేద తీరుతున్న తన లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరొకసారి సంచలన వార్తలకు చిరునామాగా మారింది అనసూయ.

స్లీవ్ లెస్ కాస్ట్యూమ్స్ తో స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్లుగా హాట్ ఎక్స్ పోజింగ్ తో అనసూయ షేర్ చేసిన ఈఫోటో ఆమె అభిమానులకు మంచి జోష్ ను కలిగించడంతో ఈఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. అనసూయ ఏమిచేసినా ఆదరగోడుతుంది అంటూ కామెంట్స్ చేస్తూ అనసూయ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఒకవైపు ఐటమ్ సాంగ్స్ కు తను దూరం అని అంటూ ఇలా రకరకాలుగా ఎక్స్ పోజ్ చేస్తూ అనసూయ షేర్ చేస్తున్న ఫోటోల వ్యవహారం చూస్తూ ఉంటే అత్యంత భారీ పారితోషికం ఇస్తే తాను ఐటమ్ సాంగ్స్ కు కూడ రెడీ అన్న సంకేతాలను అనసూయ ఈ ఫోటోల ద్వారా దర్శక నిర్మాతలకు ఇస్తోంది అనుకోవాలి. ఏమైనా అనసూయను అర్ధం చేసుకోవడం కష్టం.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: