బ్లూ ఫిల్మ్ స్టార్‌తో యువ హీరో!?
సన్నీలియోన్... పోర్న్ ప్రపంచంలో ఓ స్టార్! ఆ తరహా సినిమాలు తీసీ తీసి విరక్తి వచ్చిందేమో..? సడన్‌గా బాలీవుడ్లో ప్రత్యక్షమైంది. దక్షిణాది నుంచి కూడా కొంతమంది దర్శక నిర్మాతలు... సన్నీ డేట్ల కోసం ప్రయత్నించారు. ఆ అవకాశం కైజాద్ గుస్తాద్కి దక్కింది. సన్నీతో ఆయన 555 అనే సినిమా తీయబోతున్నారు. ఇందులో కథానాయకుడిగా ప్రేమిస్తే ఫేమ్ భరత్‌ని ఎంచుకొన్నారు.
జూదం, మాదక ద్రావ్యాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో సన్నీ పాత్ర గరమ్ గరమ్‌గా ఉంటుందట. సెక్స్, కామెడీ, క్రైమ్ నేపథ్యంలో సాగే సినిమా అట. ఓ బ్లూ ఫిల్మ్ స్టార్‌తో భరత్ ఎలా నటిస్తున్నాడో..? అని తమిళ సినీ వర్గాలు ముక్కున వేలేసుకొంటున్నాయి. భరత్ మాత్రం సినిమాని సినిమాగానే చూడమని సెలవిస్తున్నాడు.
ఈ సినిమా కోసం సన్నీ కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసిందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తారట. నీలి చిత్ర సుందరిని చూడ్డానికి జనం క్యూ కట్టడం ఖాయం అని చిత్రబృందం నమ్మకాలు పెట్టుకొంది.