మెగా పవర్ స్టార్ రాం చరణ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. టైటిల్ పోస్టర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ సినిమా అంటే దేవి మ్యూజిక్ ఉండాల్సిందే. ఇక ఈ ఇద్దరు కలిసే ఆ సినిమాలో ఓ ఐటం సాంగ్ కూడా అదిరిపోవాల్సిందే. ఆ లెక్కన రంగస్థలంలో కూడా ఓ ఐటం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
చరణ్ పక్కన హాట్ ఐటం గా ఈసారి బాలీవుడ్ భామను దించే ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం రంగస్థలంలో ఐటం సాంగ్ కోసం సోనాక్షి సిన్హా ను అడుగుతున్నారట. బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా చేసిన సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న సోనాక్షి సౌత్ లో రజినికాంత్ తో లింగా సినిమాలో నటించింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో అమ్మడి లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు. చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నాయి. ఈమధ్యనే తన ఫిజిక్ మీద దృష్టి పెట్టి మరింత హాట్ లుక్ గా కనిపించేందుకు సోనాక్షి వర్క్ అవుట్ చేసింది. ఈ సినిమానే కాదు చిరు చేయబోయే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇప్పటికే చరణ్ సినిమా ఐటం సాంగ్ గురించి అడిగినా ఆమె ఇంకా ఫైనల్ డెశిషన్ చెప్పాలేదట. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో సోనాక్షి హాట్ ఐటం గా ఎంట్రీ ఇస్తే మాత్రం కచ్చితంగా ఆమెకు ఇక్కడ మంచి ఛాన్సులు దక్కే వీలుంటుంది. మరి సోనాక్షి అందుకు ఒప్పుకుంటుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.