‘దువ్వాడ జగన్నాథం’ స్టోరీ లీక్..సోషల్ మీడియాలో హల్‌చల్..!

Edari Rama Krishna
ఈ మద్య ఏ కొత్త సినిమా వచ్చినా క్షణాల్లో లీక్ కావడం పరిపాటైంది.  ముఖ్యంగా  టెక్నాలజీ జోరు పెరుగుతున్న క్రమంలో లీకుల గొడవ కూడా ఎక్కువగా వినిపిస్తున్నది.  ఒకప్పుడు ఓ సినిమా లీక్ కావాలన్నా..పైరసీ కావాలన్నా రోజుల పట్టేవి. కానీ ఇప్పుడు అలా కాదు సినిమా రిలీజ్ అయిన మూడు గంటల్లోనే  ఇంటర్ నెట్ లో ప్రత్యక్షం అవుతుంది.  ఈ లీకుల గోల చిన్న సినిమాలకే కాదు కోట్లు పెట్టి నిర్మించిన భారీ చిత్రాలకు కూడా తప్పడం లేదు.  ఓ వైపు సైబర్ క్రైమ్ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంత మంది లీక్ రాయుళ్లు సినిమాలను లీక్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా హరీష్ శంకర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం స్టోరీ లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  ఇక లీక్ అయిన స్టోరీ ప్రకారం..దువ్వాడ జగన్నాథం ఓ అగ్రహారంలో వంట మనిషిగా పనిచేస్తుంటాడు. వంటలకు సామాన్లు సమకూర్చుతూ అక్కడి పనులు చక్కబెడుతూ ఉంటాడు.  ఓ ఫంక్షన్‌లో పూజా హెగ్డేతో పరిచయం అవుతుందట. తొలిచూపులోనే ఆమెను జగన్నాథం ప్రేమిస్తాడు.  ఆ అగ్రహారానికి సంబంధించి భూమి చాలా విలువైంది కావడంతో దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తాడు  రొయ్యల నాయుడు (రావు రమేశ్).

ఈ క్రమంలో విదేశాల్లో మాఫియా డాన్ గా పేరుపొందిని మరో విలన్ ఆ భూమిపై కన్నేస్తాడు. ఈ క్రమంలో విలన్లు  ఆ ప్రాంతానికి వచ్చి అగ్రహారంలో ఉన్నవారందరినీ బెదిరిస్తారు.    దీంతో దువ్వాడ జగన్నాథం కాస్త డీజే గా మారి ఫారిన్ లో ఉన్న డాన్ సంగతి చూడటానికి వెళ్తాడు..కానీ తీరా ఆ మాఫియా డాన్ చూసి షాక్ కి గురౌతాడు.  ఇంతకీ ఆ ఆగ్రహారాన్ని దక్కించుకునే క్రమంలో విలన్ల అంతం ఎలా చూస్తాడు..అన్నది సినిమాలో అసలైన కథ.  

ఇక ఫస్టాఫ్ మొత్తం బన్నీ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఇరగీదీశాడని ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ అని తెలుస్తోంది. రెండు రోల్స్‌లోనూ అల్లు అర్జున్ అద్భుతంగా చేశాడని డీజేగా స్టైలిష్ లుక్‌తో అదరగొట్టేశాడని బన్నీని ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ యాంగిల్‌లో డీజే పాత్ర ఉన్నట్టు సమాచారం. పూజా హెగ్డే, బన్నీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కైట్ అయ్యిందని.. పూజా గ్లామర్ షోకి ఫిదా కావడం ఖాయం అంటున్నారు.

ఇక దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. వాస్తవానికి ఇండస్ట్రీలో ఇలాంటి కథాంశాలు ఎన్నో వచ్చాయి..కానీ దువ్వాడ జగన్నాథం మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం  హిట్టా..ఫట్టా అనేది రేపటి వరకు ఆలోచించాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: