మహేష్ బాబు ఇంట్లో రవితేజా బ్రాహ్మడుహడావిడి

K Prakesh

ప్రిన్స్ మహేష్ బాబు ఇంట్లో రవితేజాకు అదృష్టాన్ని కలిగించిన బ్రాహ్మడు హడావిడి చేస్తున్నాడట. చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మాస్ మహారాజా రవితేజ వరుస పెట్టి వస్తున్న ఫ్లాప్ లమధ్య సతమతమవుతూ ఉంటే ఆ మధ్య రవితేజా ఇంట్లో ఒక జోతిషుక్కుడు పదివేల కొబ్బరికాయలతో పూజలు చేయించి రవితేజకు ‘బలుపు’ సినిమాను హిట్ గా మార్చాడు అన్న వార్తలు చదివే ఉంటారు. మరి ఆ పూజల మహిమతో రవితేజాకు బలుపు హిట్ సినిమాగా మారడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో అతడికి మంచి డిమేండ్ ఏర్పడిందట. దీనితో ప్రస్తుతం ఆయన ప్రిన్స్ మహేష్ బాబు ఇంట్లోనే పాగా వేసాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం విడుదల కాబోతున్న మహేష్ సినిమా ‘1’ (నేనొక్కడినే) బ్లాక్ బస్టర్ అయ్యేటట్లుగా మన టాలీవుడ్ ప్రిన్స్ ఇంట్లో కూడా హోమం చేయించడానికి రంగం సిద్దం చేస్తున్నాడట.

ప్రిన్స్ మహేష్ భార్య నమ్రతకు వాస్తూ జాతకాలు చాలా నమ్మకం ఆ నమ్మకం రీత్యా రావితేజాకు అదృష్టాన్ని ఇచ్చిన పూజను మహేష్ ఇంట్లో కూడా జరిపించడానికి నమ్రత ఏర్పాట్లు చేస్తోందట. ప్రస్తుతం నమ్రత మహేష్ తో లండన్ లో షూటింగ్ స్పాట్లో ఉండటంతో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఈ హోమం ఏర్పాట్లు చూస్తున్నాడని టాక్. ఇలా ఒక్క సినిమా హిట్ అయితే చాలు హీరోలకే కాదు ఆ సినిమాకు పూజలు చేయించిన పంతులు కూడా హీరో అయిపోతున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: