ఎట్టకేలకు ఖరారయిన ఎవడు రిలీజ్ డేట్
రామ్ చరణ్ శ్రుతి హసన్ హీరో హీరోయిన్ లు గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఎవడు చిత్ర విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారయ్యింది . మొదట ఈ చిత్ర విడుదల తేదీ జూలై 26 గా ప్రకటించినా తరువాత వాయిదా వేసారు. తాజాగా ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయ్యనున్నామని అధికారికంగా ప్రకటించారు .
ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బన్నీ పాత్ర చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు . ప్రస్తుతం రేస్ గుర్రం చిత్ర చిత్రీకరణలో ఉన్న అల్లు అర్జున్ రేపటితో ఆ చిత్రీకరణ పూర్తి చేసుకొని ఎవడు చిత్రం కోసం రెండు రోజులు చిత్రీకరణలో పాల్గొననున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు . అల్లు అర్జున్ మరియు కాజల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఈ చిత్ర ఆడియో విడుదల అయ్యి విజయం సాదించింది . మరి ఈసారి చెప్పిన తేదీలో అయినా చిత్రం విడుదల అవుతుందో లేదా మళ్ళీ వాయిదా పడుతుందో అన్నది వేచి చూడాల్సిన విషయం