ఉదయ్ కిరణ్ గురించి షాకింగ్ నిజాలు చెప్పింది..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘చిత్రం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఉదయ్ కిరణ్. తేజ తీసిన ‘చిత్రం’ సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. అప్పట్లో చిన్న చిత్రమే అయినా సూపర్ హిట్ చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత  నువ్వు నేను,మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమా తో 2001 ఫిలింఫేర్ అవార్డ్ కూడా వరించింది.  మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా..కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహం జరగలేదు.  

ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని తన నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు.  అయితే  ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పరిశ్రమలో ఓ సంచలనం. ఆయన మరణించి దాదాపు మూడేళ్లపైనే అయినా ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదె అంటే తెలుగు ప్రేక్షకుల మదిలో ఉదయ్ కిరణ్. తాజాగా ఆయన సోదరి శ్రీదేవి,  ఉదయ్ కిరణ్ జీవితానికి సంబంధించిన పలు సెన్సేషనల్ విషయాలు ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.    

మా సోదరుడి తలరాత సరిగ్గా లేదని దానివల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని దానికి ఎవరినో నిందించాల్సిన అవసరం లేదని అంటోంది శ్రీదేవి . తన జీవితంలో ఓ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాడని కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందానమన్న సమయంలో చిన్న మనస్పర్థలు రావడంతో విడిపోయారని కానీ చాలా కాలం వరకు ఆ అమ్మాయిని మర్చిపోలేక పోయాడని బాధపడింది.  

ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, సినిమా అవకాశాలు లేవని ఇలా చాలా వార్తలు వినిపించాయి. కానీ అవన్నీఅవాస్తవమని మియా పూర్, శంషాబాద్ మూడు ల్యాండ్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ ఉంది. మనీ లేక పోవడ కారణం కాదు, సినిమాల్లేక పోయినా జీవించే స్తోమత ఉంది అని తమ్ముడి గురించి శ్రీదేవి చెప్పుకొచ్చారు.

ఇక చిరంజీవి కూతురుతో నిశ్చితార్తం..తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడంపై మాట్లాడుతూ..అది నిజమే కానీ దాని వల్ల మా తమ్ముడికి..మెగా ఫ్యామిలీకి ఎలాంటి మనస్పర్థలు రాలేదని పైగా ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవి తప్పు ఇసుమంత కూడా లేదని అంటుంది. అంతే కాదు చాలా విషయాల్లో ఆయన మాకు అండగా నిలిచారని ఒక రకంగా చెప్పాలంటే ఆయన మా తమ్ముడికి గాడ్ ఫాదర్ లాంటి వాడని అంటుంది.  

తన తమ్ముడు ఆత్మహత్యకు కారణం మనీ లేక పోవడం కాదు..చిత్ర పరిశ్రమ తనను సరిగా గుర్తించలేదన్న బాధ అతడిలో ఉండేది అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడేమో  అని తమ్ముడి గురించి శ్రీదేవి చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: