“మహానటి” సినిమా కోసం దుల్కర్ సల్మాన్ “ఫస్ట్-లుక్” విడుదల



సావిత్రి మహనటి ఇటు తెలుగువారికి అటు తమిళులకు ఆరాధ్యనటి. వెండితెర ఇలవేల్పు.350 సినిమాలకు పాత్రలకు పైగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన కళామతల్లి. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.అర్, శివాజి గణేషన్, ఎంజిఆర్ లాంటి విఖ్యాత నటులతోనే కాదు ఆ తరవాతి తరం నటుల తోను అంతే స్థాయిలో నటించి మెప్పించి చిత్రసీమ చరిత్రలో చిరకాలం నిలిచిన నటీమణి సావిత్రి.  అలాంటి సావిత్రి జీవిత చరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు “నాగ్ అశ్విన్” తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

 


ఈ సినిమాలో సావిత్రి గా కీర్తి సురేశ్ నటిస్తోంది. సావిత్రి  అద్భుత అందాల తమిళ నటుడు అప్పటికే పెళ్ళై పిల్లలున్న జెమినీ గణేశన్ ను ప్రేమలో పడి పెళ్ళి  చేసుకుందనే సంగతి తెలిసిందే.  ఆ తరువాత వాళ్ల వైవాహిక జీవితం అనెక సమస్యలతో  గొడవలతోనే కొనసాగింది.  అందువలన ఈ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను చూపించవలసిన అవసరం వుంది. ఆ పాత్ర కోసం మలయాళ యువ కథానాయకుడు “దుల్కర్ సల్మాన్” ను తీసుకున్నారు.


 


దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు మొన్న అంటే 28 జూలై , సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. అందం లో గాని రూపంలో గాని జెమిని గణేషన్ కు తీసిపోనట్లున్న దుల్కర్ సల్మాన్ ఆ పాత్రలో ఇమిడి పోతాడనుకోవటం లో సందేహం లేదు.  పాత కాలం నాటి ఆల్బమ్ నుంచి తీసిన ఫోటోగా ఆయన లుక్ ను రివీల్ చేయడం విశేషం. గుడ్ గోయింగ్.   




ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజిఆర్, శివాజి గణెషన్, ఎస్వీఆర్, భానుమతి, జమున లాంటి వైవిధ్యమైన పాత్రలకు  ఎవ రిని ఎంపిక  చేయనున్నారనేది,  ప్రస్తుతం అంటే ఈ ఫస్ట్-లుక్ చూశాక  ఆసక్తికరంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: