నెటిజన్ల పై చిందులేస్తున్న గుత్తా జ్వాల..!

Edari Rama Krishna
బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకుంది గుత్తా జ్వాలా.  ఈ అమ్మడు క్రీడలకన్నా గ్లామర్ పైనే ఎక్కువ ఫోకస్ అయ్యింది.  మంచి ఫిజిక్..సెక్సీ లుక్స్ తో క్రీడాకారుల్లో అందమైన క్రీడాకారిణి గుత్తా జ్వాల అని చెప్పుకునేలా చేసింది.  అంతే కాదు ఆ మద్య సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది..కానీ తన పర్సనాల్టీకి ఒక్కరిద్దరూ హీరోలు తప్ప ఎవరూ సూట్ కారని తేలిపోయింది.   ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రంలో నితిన్ తో ఓ క్లబ్ సాంగ్ లో చిందులేసింది.  ఆ తర్వాత సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ బాగానే పాపులర్ అయ్యింది.  

తాజాగా ఈ అమ్మడు  తనను పదేపదే టార్గెట్ చేస్తున్న నెటిజన్లపై మండిపడింది.  అంతే కాదు తనపై పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టావో నీ అంతు చూస్తా అని ఘాటుగానే హెచ్చరించింది.   వివరాల్లోకెళితే.. ఇటీవల తల్లి, సోదరితో కలిసి ఉన్న ఓ వీడియోను జ్వాల సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ, మీ తల్లి చైనా దేశస్థురాలైనందుకేనా, నీవు పదేపదే ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావ్? అని పోస్ట్ చేశాడు.  ఈ మద్య చైనా, భారత్ ల మద్య యుద్ద వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే..ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ నెటిజన్ ఇలా పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది.  

అయితే దీనిపై స్పందించిన గుత్తా ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో. ఏదైనా అడుగాలనుకుంటే నేరుగా నన్ను అడుగు. అంతేకానీ, ఈ సంభాషణలోకి అనవసరంగా మా అమ్మానాన్నలను లాగుతున్నావెందుకు? మరోసారి ఇలాగే చేస్తే, నాలో మరో కోణాన్ని చూడాల్సి వస్తుంది.  

మరో నెటిజన్ నీ జీవితంలో అజారుద్దీన్ ఎన్నో సమస్యలు తీసుకు వచ్చారు కదా..! అతని వల్లే మీ వైవాహిక జీవితం నాశనమైంది కదా అన్న ప్రశ్నకు..ఈ ప్రశ్న నా ముందు వచ్చి అడిగి ఉంటే నేనేంటో నీకు చూపించేదాన్ని అని..ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఇలా నెట్లో పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది. తల్లితో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి జ్వాలపై యాంటీ మోడీ, యాంటీ నేషనల్ అంటూ సోషల్‌మీడియాలో చాలామంది నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: