పవన్ వ్యక్తిత్వం పై గిరిబాబు సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ప్రముఖ నటుడు గిరిబాబు ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అదేవిధంగా హీరోల మధ్య ఉండే ఇగోల గురించి అనేక ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ కాలంలోనే ఇండస్ట్రీలో అగ్ర హీరోల మధ్య వైరుధ్యాలు ఉండేవి అని అంటూ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ మధ్య నడిచిన శత్రుత్వం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ షిప్ట్ అయ్యే సమయంలో ఎన్టీఆర్, ఎన్.ఆర్ మధ్య విభేదాలు వచ్చాయని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు గిరిబాబు. ఇదే సందర్భంలో గిరిబాబు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం రాలేదు అని అంటూ అందుకు కారణం ఆ సినిమాల్లో తాను చేయాల్సిన పాత్రలు లేక పోవడమే అయి ఉంటుంది అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

ఇదే సందర్భంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ స్పాట్ కు ఈమధ్య తాను వెళ్ళిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను వెళ్ళగానే తనను చూసి పవన్ కళ్యాణ్ లేచి వచ్చి పలకరించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు తాము ఇద్దరం ఇప్పటి వరకు ఒక సినిమాకు కూడ పనిచేయలేదు అన్న విషయాన్ని స్వయంగా పవన్ గుర్తుకు చేసుకుంటూ త్రివిక్రమ్‌ను పిలిచి ‘మన సినిమాలో ఏదైనా పాత్ర ఉందా’ అని పవన్ అడిగిన సందర్బాన్ని గుర్తుకు చేసుకుని పవన్ నిరాడంబరత పై ప్రశంసలు కురిపించాడు గిరిబాబు. 

ఇదే ఇంటర్వ్యూలో గిరిబాబు పవన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెద్దల పట్ల రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి అని అంటూ అతడు మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా జెంటిల్ మ్యాన్ అంటూ ప్రసంసలు కురిపించాడు గిరిబాబు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగు దేశం పార్టీ గెలిచింది అన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తూ పవన్ రాజకీయాలలో రాణించడం ఖాయం అని అంటున్నాడు. 

అంతేకాదు సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు అని అంటూ ఒకరి అవసరం మరొకరికి ఎప్పటికైనా ఉంటుందని గిరిబాబు కామెంట్ చేసాడు. ఈయన కామెంట్స్ ను బట్టి చూస్తుంటే గిరిబాబు కుటుంబ సభ్యులలో ఎవరో ఒకర్ని రాజకీయాలలోకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘జనసేన’ లోకి తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదు అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: