‘లీడర్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచియం అయిన రానా కు బ్యాక్ గ్రౌండ్ ఉన్నా నటుడిగా పేరులోకి రావడానికి చాలా సమయం పట్టింది. అయితే రానాకు రియల్ స్టార్ స్టేటస్ ‘బాహుబలి’ తో మాత్రమే వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన రానా తన సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్లో ఇంత వరకు నటించలేదు.
ఈ నేపధ్యంలో రానా తన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తొలిసారి ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారం వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలాను చలా విభిన్నంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో హైదారాబాద్ లో జరిగిన ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో రానా తాత రామానాయుడిని తలచుకొని ఉద్వేగానికి లోనుకావడం అందరినీ కదిలించింది.
ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ తమ ఇంట్లో సినిమామే ప్రపంచం అని అంటూ తామంతా ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుకుంటాం అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈసినిమాను తన తాత రామానాయుడు చూడలేకపోయాడు అన్న బాధ తనకు ఉందని అంటూ ఎమోషనల్ అంశాలతో కూడిన ఇలాంటి చిత్రాలు తన తాతకు బాగా నచ్చుతాయి అంటూ భావోద్వేగానికి గురి అయి కంటి వెంట నీళ్ళు రావడంతో కాసేపు తన కన్నీరును అదుపు చేసుకోవడానికి సమయం తీసుకున్నాడు.
అయితే వెంటనే తేరుకున్న రానా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తమ అందరికీ అన్నీ ఉన్నా తమ తాత లేడు అన్న లోటు ఒక్కటే ఎప్పుడూ తమను వెంటాడుతోంది అంటూ ఈ రోజు ఇక్కడ నిలుచుని ఉన్నానంటే ఆయన వల్లనే అని చెప్పి మరొకసారి తన తాత రామానాయుడు పై ప్రశంసలు కురిపించాడు రానా.
అయితే ఎటువంటి భావోద్వేగాలకు లోనుకాకుండా ఎప్పుడు గంభీరంగా కనిపించే రానా కంటి వెంట కన్నీరు రావడం చూసిన అతడి తండ్రి సురేశ్ బాబు కూడ ఉద్వేగానికి లోను కావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే వారం విడుదల కాబోతున్న ఈసినిమాకు వ్యూహాత్మకంగా చేస్తున్న పబ్లిసిటీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఈ సినిమా గ్యారంటీ హిట్ అన్న పాజిటివ్ టాక్ ను అప్పుడే సంపాధించుకుంది..