చరణ్ హీరోయిన్ గా స్టార్ హీరో కూతురు..! ఎవరో తెలుసా..?

Vasishta

టాలీవుడ్ హీరో రాంచరణ్ ప్రస్తుతం రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రాం చరణ్ తదుపరి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాపై ఓ క్లారిటీ రావడమే కాదు.. హీరోయిన్ కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.


          రాం చరణ్ నెక్స్ట్ మూవీ క్రియేటివ్ దర్శకుడు మణిరత్నంతో చేయబోతున్నాడు. మణిరత్నం డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ మూవీ చేయబోతున్నాడని చాలాకాలంగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే అది ఇంతకాలానికి పట్టాలెక్కుతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన మణిరత్నం సినిమాలో ఐశ్వర్యా రాయ్ రీఎంట్రీ ఉండబోతుందని కూడా ఊహాగానాలు వినిపించాయి.


          అయితే ఐశ్వర్యా రాయ్ ప్లేస్ లో కొత్త తార నటించబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ ను మణిరత్నం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం  సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడం అంత ఆషామాషీ కాదు. ఆ ఛాన్స్ కోసం ఎంతోమంది తారలు ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్ సారా ఆలీఖాన్ దక్కించుకోబోతోంది. లక్కీ గర్ల్..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: