గిలిగింతలు పెట్టె శర్వానంద్ "మాహనుభావుడు" టీజర్‌




మారుతి దర్శకత్వంలో శర్వానంద్‌, మెహరీన్‌ కౌర్  జంటగా ఎస్ ఎస్ తమన్ సంగీత దర్శకత్వంలో  తెరకెక్కిన  "మాహాను భావుడు"  చిత్రం, ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ గురువారం విడుదల చేశారు.

"నా పేరు ఆనంద్‌, నాకు ఓసీడీ ఉంది, ఓసీడీ అంటే బీటెక్‌, ఎంటెక్‌ లాంటి డిగ్రీలు కాదు, డిజార్డర్‌. దీని లక్షణాలు అతి శుభ్రం. విపరీతమైన నీట్‌నెస్‌" అంటూ విలక్షణ నటుడు శర్వానంద్‌ 'మహానుభావుడి'గా ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాడు. 





ఓసిడి అంటే "అబ్సెస్సివ్ కంపల్సివ్ దిసార్డర్" అనే జబ్బుతో బాధపడే వ్యక్తిగా శర్వానంద్‌ ఈ టీజర్‌తో ఆకట్టుకున్నాడు అతి శుభ్రం, విపరీతమైన నీట్‌నెస్‌ . దీని లక్షణాలు'   హీరోయిన్‌ కాళ్లను కాళ్లతో రొమాంటిక్‌ తాకడానికి ముందు కాళ్ళపై స్పే చేయడం, బాస్‌కు తుమ్ము వచ్చినట్టయితే, అంత దూరం పరిగెత్తుకెళ్లి, ఇక మీరు తుమ్మండి సార్‌ అనడం, హీరోయిన్‌ను రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకోబోతూ ఉంటే, "బ్రెష్ చేసావా" అని ప్రశ్నించడం, ఈ టీజర్‌హైలెట్స్‌.



మొత్తానికి 'భలే భలే మగాడివోయ్‌'లో మతి మరుపు హీరోతో హాస్యం పండించి నవ్వులు పూయించిన విభిన్న శైలి అనుసరించే దర్శకుడు మారుతి,  ఈసారి  అబ్సెస్సివ్ కంపల్సివ్ దిసార్డర్"  లేదా బాగా అర్ధమవటానికి  "ఓవర్‌ క్లీనింగ్‌ డిజార్డర్‌" తో బాధపడే హీరో స్వబావం తో నవ్వులు పూయించటం ఖాయమని టీజర్‌ తో ముందుగానే చెప్పాడు. ఇంకేం ఈ సినిమా హాస్యం ఆనందం అన్-లిమిటెడ్ మీరూ ఒకసారి లుక్‌ వేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: