బాలకృష్ణ స్టెప్స్ పై సెటైర్లు !

Seetha Sailaja
చిరంజీవితో పోల్చుకుంటే బాలకృష్ణ స్టెప్స్ విషయంలో అంతగా రాణించిన సందర్భాలు లేవు. అయినా లక్షలాది మంది నందమూరి అభిమానులు ఈ చిన్న విషయాన్ని పట్టించుకోవడం ఎప్పటి నుంచో మానేశారు. 

అయితే టాప్ యంగ్ హీరోలతో పోటీ ఇస్తూ తాను ఏ విషయంలోనూ తక్కువేమీ కాదు అని అనిపించే విధంగా బాలకృష్ణ ‘పైసా వసూల్’ సినిమాలో వేసిన స్టెప్స్ ను చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్న ఈమూవీ పై భారీ అంచనాలు పెరిగిపోయిన నేపధ్యంలో ఆ అంచనాలను మరింత పెంచడానికి పూరిజగన్నాథ్ ఈసినిమాలోని సాంగ్ ప్రోమోలను రిలీజ్ చేస్తూ ఈసినిమాకు మరింత హైక్ తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య  గతంలోనందమూరి తారకరామారావు నటించిన ‘జీవిత చక్రం’ సినిమాలొని ‘కొంటె చూపు చెపుతోంది’ పాటను బాలకృష్ణ పై రీమిక్స్ చేసిన వీడియో క్లిపింగ్ ను విడుదల చేసారు. అప్పట్లో ఎన్టీఆర్ వాణిశ్రీ అలనాటి ప్రేక్షకుల కోసం రెచ్చిపోయి నటించిన ఆ పాట ఇప్పటికీ సూపర్ హిట్.

అయితే ఆ పాటను ‘పైసా వసూల్’ మూవీ కోసం రీ మిక్స్ చేసిన విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య తండ్రిని  ఇమిటేట్ చేస్తూ చూపించిన హవా భావాలు సుపర్బ్ గా ఉన్నాయి కాని.. ఒక్కోసారి మాత్రం ఏదో సీనియర్ ఎన్టీఆర్ ను వెటకారం చేసినట్లుగా ఉన్నాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 

అంతేకాదు బాలకృష్ణ కేవలం ఈపాటను రీమిక్స్ చేస్తే సరిపోయేది కాని ఇలా ఎన్టీఆర్ డ్యాన్సులను అప్పటి కాస్ట్యూమ్స్ ను అలా యధాతధంగా దించేయవలసిన అవసరం ఏముంది అంటూ మరికొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరపచిన ఈ పాటను సీనియర్ గాయకుడు మనో పాడాడు. అయితే ఈ పాటను ఇలా రీమిక్స్ చేయడం బాలకృష్ణ అభిమానులకు జోష్ ను కలిగిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఇది మరీ అతిగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: