నటి సుహాసిని కొడుకుని నిలువునా దోచారు..ఎక్కడా..!

Edari Rama Krishna
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయారు..నవ్వులు హాసిని..సుహాసిని.  ఆమె నవ్వు అంటే ఎంతగానో అభిమానించే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు.   గత కొంత కాలంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సుహాసిని అత్త, తల్లి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.  స్టార్ దర్శకులు మణిరత్నం ని వివాహం చేసుకున్న కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తల్లి పాత్రలు చేస్తూ  ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

 తాజాగా మణిరత్నం, నటి సుహాసిని తనయుడు నందన్ ను గుర్తు తెలియని దొంగలు దోపిడీ చేశారని సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.  ఇటలీలోని వెనిస్ దగ్గర్లో ప్రస్తుతం నందన్ ఉన్నాడని, తెలిసిన వారు ఎవరైనా ఉంటే తన కుమారునికి సాయం చేయాలని ఆమె అభ్యర్థించారు.  తన కొడుకు బెలున్నో ప్రాంతంలో ఉన్నప్పుడు దోపిడీకి గురయ్యాడు.

 ఎవరైనా విమాశ్రయం దగ్గర ఉంటే తనకు సహాయం చేయండి..వెనిస్ లో ఉండి సాయం చేయలేని వారు మాత్రం నేను పోస్టు చేసిన ఫోన్ నంబర్ కు కాల్ చేయవద్దు.  ఎందుకంటే తన సెల్ ఫోన్ లో బ్యాటరీ కూడా చాలా లో ఉందని..పదే పదే కాల్స్ చేస్తే ఆ కాంటాక్ట్ కూడా మిస్ అవుతానని ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో ఈ ట్విట్ కాస్త వైరల్ కావడంతో..వెనిస్ లోని భారతీయులు నందన్ కు సాయపడేందుకు పోటీ పడ్డారు. కొద్ది సేపు తర్వాత సుహాసిని మరో ట్విట్ పెట్టింది..తన కొడుకు క్షేమమని, ఓ హోటల్ లో దిగాడని చెబుతూ, సాయపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు.
 
ppl who can't help in venice pls don't call the number i posted earlier as your drain out his battery & he ll lose contact

— Suhasini Maniratnam (@hasinimani) August 27, 2017 people from india pls don't call and harass some one who already is in distress

— Suhasini Maniratnam (@hasinimani) August 27, 2017 Our son checked into a hotel. He is safe tonight

— Suhasini Maniratnam (@hasinimani) August 27, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: