నటుడు ఆర్‌ఎన్‌ సుదర్శన్‌ మృతి..!

Edari Rama Krishna
కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ కన్నడ నటుడు ఆర్‌ఎన్‌ సుదర్శన్‌ (78) మృతి చెందారు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ కన్నడ నటుడు ఆర్ఎన్ సుదర్శన్ (78) మృతి చెందారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు.  

కన్నడతో పాటు పలు తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో సుదర్శన్ నటించారు.  కేవలం నటుడిగానే కాకుండా ఎన్నో చిత్రాలకు నిర్మాత గా కూడా వ్యవహరించారు సుదర్శన్.  ఇదిలా ఉండగా, సుదర్శన్ మృతిపై ప్రముఖ నటి రాధిక తన సంతాపం తెలిపింది. సుదర్శన్ తో కలసి పలు చిత్రాల్లో నటించానని, ఆయనతో, భార్య శైలజతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని రాధిక తన ట్వీట్ లో పేర్కొంది.

2010లో హీరో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్‌’ చిత్రంతో సందర్శన్‌ చివరిసారిగా నటించారు. అలాగే మణిరత్నం డైరక్షన్‌లో కమల్‌హాసన్‌ హీరోగా నటించిన నాయగన్‌లోనూ ప్రతినాయక పాత్ర పోషించారు. 
Rip #Sudarshan garu. Worked in many movies and shared a warm relationship with him and his wife. pic.twitter.com/NHQesBfcqo

— Radikaa Sarathkumar (@realradikaa) September 8, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: