మహేశ్‌బాబుని తెగ మెచ్చుకుంటున్నాడు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  తాజాగా తమిళ స్టార్ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన ‘స్పైడర్’ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే.

కాగా, నిన్న రిలీజ్ అయిన స్పైడర్ చిత్రం పై రక రకాల రివ్యూలు వచ్చాయి.  మొత్తానికి సినిమా పై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం దుమ్మురేపాయి.  సినిమా పరంగా చూస్తే.. సమాజంలో సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది..దాని బారిన ఎలా పడుతున్నారన్నది విశ్లేషించినట్లు ఉంది.   

తాజాగా ఈ చిత్రంపై సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  సామాజిక సందేశంతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన స్పైడర్ మూవీకి తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రశంసలందించారు. 

మురుగదాస్ అండ్ టీం రజనీకాంత్ కోసం స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన తర్వాత రజనీ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.  తెలుగు, తమిళ ప్రేక్షకులకు మంచి సినిమాను అందించిన మురుగదాస్ అండ్ టీంకు రజనీ బెస్ట్ విషెస్ తెలిపారు. మహేశ్ బాబు న‌ట‌న‌ అద్భుతమ‌ని రజనీ కాంత్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: