ప్రధాని నరేంద్ర మోదీపై ప్రకాశ్ రాజ్ ఫైర్..అందుకేనా..!

Edari Rama Krishna
తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.  కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ప్రకాశ్ రాజ్ తెలంగాణలోని హబూబ్‌నగర్‌ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మాద్యమాల్లో యాక్టీవ్ గా ఉండే ప్రకాశ్ రాజ్ తాజాగా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై మోదీ స్పందించకపోవడాన్ని ప్రకాశ్‌రాజ్ తప్పుబట్టాడు. 

తాను సినిమాల్లో నటిస్తుంటే..మోదీ మాత్రం బయట తనకన్నా అద్భుతంగా నటిస్తున్నారని విరుచుకు పడ్డాడు.  ప్రధాని తన మౌనాన్ని వీడకపోతే తన నేషనల్ అవార్డులను తిరిగి ఇచ్చేస్తారనని బెదిరించారు. సోషల్ మీడియాలో చాలా మంది గౌరీ లంకేష్ హత్యను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ల భావజాలం ఏంటో అందరికీ తెలుసు. వీళ్లలో కొందరు ప్రధాని నరేంద్ర మోదీ ఫాలోవర్లు ఉన్నారు.

ఇదే నన్ను బాధిస్తున్నది అని ప్రకాశ్ రాజ్ అన్నాడు.  ఇలాంటి విషయాల్లో మౌనం వహిస్తే అది సమర్ధించినట్టు అవుతుంది. కాబట్టి మోదీ ఈ విషయంపై మౌనం వీడాలని ప్రకాశ్ రాజ్ కోరారు. ఇకపై కూడా ప్రధాని మోదీ ఇలాగే మౌనం వహిస్తే... ఐదు జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 5న ప్రముఖ కన్నడ వీక్లీ గౌరీ లంకేష్ పత్రికె వ్యవస్థాపకురాలు గౌరీ లంకేష్‌ను దుండగుల ఆమె ఇంటి ముందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈమె ప్రకాశ్‌రాజ్‌కు దూరపు బంధువు అవుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: