కాజలా మజాకా? పరిహారం రెండున్నరకోట్లు రావల్సిందే

పారాచూట్ బ్రండ్  కొబ్బరినూనె ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థపై నటీమణి కాజల్ అగర్వాల్ న్యాయస్థానం లో వేసిన పిటిషన్ ఆసక్తి కరమైన మలుపు తిరిగింది. ఆ సంస్థ తనకు రెండున్నర కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాజల్ మద్రాస్ ఉన్నత న్యాయస్థానం లో దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో కాజల్ కు అనుకూలంగా మారింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఇది కాజల్ కు అత్యంత అనుకూలమైన పరిణామమే.




ఈ వ్యవహారం లోని అసలు విషయం ఏమంటే, కొంతకాలం కిందట కాజల్ కొబ్బరినూనె అమ్మకం కంపెనీ పారాచూట్ కోసం ఒక కోసం యాడ్ లో నటించింది. ఒప్పందం ఒక ఏడాది మాత్రమే.  దానికి గాను ఒప్పందం చేసుకుని తదుపరి ఆ సంస్థ కాజల్ అగర్వాల్ తో యాడ్ ను రూపొందించిందట. అయితే.. ఏడాది గడిచి పోయినా. కాజల్ అగర్వాల్  నటించిన ఆ యాడ్‌ను పారాచూట్ అలాగే ప్రసారం చేస్తూవస్తుంది. . దీనిపై కాజల్ అగర్వాల్  'చెన్నై సివిల్ కోర్టు' లో పిటిషన్ దాఖలు చేసింది. 


తనతో ఉన్న ఒప్పందం ప్రకారం ఒక సంవత్సరం మాత్రమే వ్యాపారానికి ఉపయోగించు కోవలసిన ఆ యాడ్ ప్రసారం అంత కు మించి ప్రదర్శించటం ఒప్పంద ఉల్లంఘన కిందకే వస్తుందని వాదించింది. ఒప్పందాన్ని  ఉల్లంఘించి పారాచూట్ సంస్థ యాడ్ ను ప్రసారం చేసిందని, ఇందుకు గానూ తనకు రెండున్నర కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని కాజల్ అగర్వాల్  తన పిటిషన్ లో పేర్కొంది. అయితే దిగువ కోర్టు కాజల్ అగర్వాల్  విన్నపాన్నిఆ సంస్థకు ఆ యాడ్‌పై అరవై సంవత్సరాల వరకూ హక్కులు ఉంటాయని పేర్కొంటూ పిటీషన్ ను తోసిపుచ్చింది. 


అక్కడ ఎదురుదెబ్బ తగిలినా కాజల్ అగర్వాల్ ఛెన్నై ఉన్నత న్యాయస్థానం తలుపుతట్టింది. ఆ సంస్థ తను నటించిన యాడ్ ను వాడుకున్నందుకు పరిహారాన్ని చెల్లించాల్సిందే అని హై కోర్టులో తన వాదనలు వినిపించింది కాజల్ అగర్వాల్. ఈ నేపథ్యంలో తన కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సదరు కొబ్బరినూనె కంపెనీని ఆదేశించింది. ఆ సంస్థ న్యాయస్థానంలో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. దీంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణతో కాజల్ అగర్వాల్ అనుకున్నంత పరిహారాన్ని పొందుతుందేమో చూడాలి!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: