గరుడవేగ అదరగొట్టాడు.. రాజశేఖర్ కు హిట్ పక్కా..!

shami
యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా వస్తున్న సినిమా పిఎస్వి గరుడవేగ. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 25 కోట్ల దాకా అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం రాజశేఖర్ మార్కెట్ అంతగా లేకున్నా సరే కాన్సెప్ట్ మీద ఉన్న నమ్మకంతో అనుకున్నదంతా పెట్టేశారు.


హాలీవుడ్ సినిమాల స్క్రీన్ ప్లే అప్పియరెన్స్ ఫీల్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. బాలయ్య చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ కు ఏదో జరుగుతుంది.. అది ఓ మిషన్ ద్వారా కనిపెట్టే ఆలోచనలతో ఏజెంట్ శేఖర్ ఏం చేశాడు అన్నదే సినిమా కథ. సినిమా ట్రైలర్ లో కథ అంత పర్ఫెక్ట్ గా చెప్పకున్నా సరే ప్రొడక్షన్ పరంగా సినిమా రిచ్ నెస్ ట్రైలర్ లో అర్ధమవుతుంది.


టెక్నికల్ గా అడ్వాన్సెడ్ తో వస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ సరసన పూజా కుమార్ నటించింది. ఇక సన్ని లియోన్ తో ఓ ఐటం సాంగ్ కూడా పెట్టాడు ప్రవీణ్ సత్తారు. మరి ప్రవీణ్ చేస్తున్న ఈ మిషన్ గరుడవేగ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సినిమా ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో చూపించిన ప్రవీణ్ సత్తారు సినిమాతో హిట్ కొట్టేలానే ఉన్నాడనిపిస్తుంది. 


ఇక కంటెంట్ బేస్డ్ స్టోరీతో పాటుగా యాక్షన్ ఎంటర్టైనర్ గా టెక్నికల్ గా సినిమా రిచ్ గా కనిపిస్తుంది. యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అదరగొడుతున్నాయి. నవంబర్ 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రాజశేఖర్ ను హిట్ ట్రాక్ ఎక్కించేస్తాయేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: