ఎవరేమన్నా నాని వచ్చేది ఆరోజే..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా ఎం.సి.ఏ. వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్పటికే ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఏర్పడ్డ కన్ ఫ్యూజన్ కు తెర పడింది.


ముందునుండి అనుకున్నట్టుగానే డిసెంబర్ 21న నాని ఎం.సి.ఏ రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే డిసెంబర్ 22న అఖిల్ విక్రం కుమార్ కాంబినేషన్ లో హలో సినిమా రాబోతుంది. అఖిల్ మూవీ ఫ్లాప్ అవ్వగా రెండో సినిమా మీద ఎంతో భాధ్యత పెట్టి మరి చేశారు.


ఈ సినిమా తప్పకుండా అఖిల్ కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని అంటున్నారు. సోలో ఫైట్ అయితే ఓకే కాని పోటీగా నాని వస్తుండగా కాస్త కష్టమే అంటున్నారు. కథ కథనాలు విక్రం మార్క్ పర్ఫెక్షన్ తో వస్తున్నా సినిమాపై ఎక్కడో ఓ చిన్న సందేహం ఏర్పడుతుంది. ఇక ఇదే కాకుండా అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమా కూడా డిసెంబర్ 23న రిలీజ్ అంటున్నారు.


రెండు భారీ సినిమాల ముందు నాని సినిమా రిలీజ్ అవడం కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి. అల్లు శిరీష్ సినిమా కూడా భారీగానే రిలీజ్ అవనుంది. మరి అఖిల్, శిరీష్ లతో పోటీ పడుతున్న నాని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. నాని మాత్రం సినిమా అవుట్ పుట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: