షాకింగ్ ప్రభాస్ ఫోన్ పై అనుష్క దృష్టి ?

Seetha Sailaja
ప్రభాస్ అనుష్కల పై గాసిప్పులు వ్రాయకుండా మీడియాకు ఒక్కరోజు కూడ గడవదు. ఆమధ్య తమ ఇద్దరి పై వస్తున్న గాసిప్పులకు ప్రభాస్ అనుష్కలు తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో మన తెలుగు మీడియా వీరిద్దరి పై గాసిప్పులు వ్రాయడం ఈమధ్య తగ్గించి వేసింది.

ఇప్పుడు ఈపనిని బాలీవుడ్ మీడియా మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియా వీరిద్దరి పై క్రియేట్ చేసిన ఒక రూమర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ కొత్తగా మొదలు పెట్టిన ఒక ప్రచారం ప్రకారం అనుష్క ఒక టిపికల్ గర్ల్ ఫ్రెండ్ అని ప్రభాస్ అంటే అనుష్కకు చాలా ఇష్టమని అతడు తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకునే మనస్తత్వం ఆమెది అంటూ బాలీవుడ్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. 

అంతేకాదు ప్రభాస్ ఫోన్ రింగ్ అయితే చాలు ఫోన్ చేసింది ఎవరు ? అంటూ అనుష్క ఆరా తీస్తుందని అదేవిధంగా అతడి ఫోన్ ను చనువుగా చెక్ చేస్తూ ఉంటుందని నేషనల్ మీడియాకు సంబంధించిన వెబ్ సైట్లలో ఇప్పుడు మరొక కొత్త గాసిప్పుల హడావిడి మొదలైంది. ఈమధ్య ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అనుష్క ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చిన తరువాత కొద్ది గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఈ గాసిప్పుల హదావిడిని లేటెస్ట్ గా మొదలు పెట్టింది బాలీవుడ్ మీడియా.

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మూవీలో అనుష్కను ఫస్ట్ ఛాయస్ అనుకుని ఆతరువాత ఆమెకు బదులు బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవడం కూడ అనుష్కకు అసహనాన్ని కలిగించింది అంటూ మరో కొత్త కోణాన్ని గాసిప్పుగా బాలీవుడ్ మీడియా క్రియేట్ చేస్తోంది. ఈవార్తలు ఎలా ఉన్నా వీరిద్దరి మధ్యా స్నేహం ఓపెన్ సీక్రెట్ కాబట్టి వీరిద్దరూ వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకునే వరకు ఇలాంటి గాసిప్పులు ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: