నానీని కలుపుకున్న నాగార్జున !
రాజకీయాలలో సినిమారంగంలో శత్రుత్వాలు శాస్వితంగా ఉండవు అన్న విషయం మరొకసారి రుజువైంది. క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ అఖిల్ నానీల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవ్వడంతో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడి నాగార్జున నానీ పై కోపం పెంచుకున్నాడు అంటూ వార్తలు హడావిడి చేసాయి. ఈ రెండు సినిమాల ఫైనల్ టాక్ బయటకు రావడంతో నాగార్జున మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.
నిన్న ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ నాగార్జున నానీతో తాను నటించబోయే మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని లీకులు ఇచ్చాడు దీనితో గత కొద్ది రోజులుగా నాగ్ నానీల మల్టీ స్టారర్ ఆగిపోతుంది అని హడావిడి చేసిన గాసిప్పులకు నాగార్జున చెక్ పెట్టాడు అనుకోవాలి. అంతేకాదు నాని కొద్ది రోజుల క్రితం నాగార్జున దగ్గరకు వెళ్లి వ్యక్తిగతంగా ‘ఎంసిఎ’ మూవీ ‘హలో’ సినిమాతో పోటీ పడటంలో తనవంతు పాత్ర లేదని వివరంగా వివరించినట్లు టాక్.
నానీ మాటలతో క్లారిటీకి వచ్చిన నాగ్ అతడితో చేయబోయే మల్టీ స్టారర్ విషయంలో తనకు రెండవ అభిప్రాయం లేదు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘ఎంసిఎ’ మూవీని ప్రమోట్ చేస్తూ నాని ఒక ఆశ్చర్యకర కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గత గురువారం విడుదలైన తన ‘ఎంసిఎ’ హైదరాబాద్ లో అత్యధిక ధియేటర్లలో విడుదల అవ్వడమే కాకుండా భాగ్యనగరంలోని ఏధియేటర్ లో చూసినా తన సినిమానే కనిపించడంతో తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది అంటూ కామెంట్స్ చేసాడు. దీనికితోడు ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చినా కలక్షన్స్ విషయంలో పెద్దగా ఏమి డ్రాప్ కనిపించకపోవడంతో ఈ క్రిస్మస్ సెలవుల సీజన్ వల్ల నానీ క్రేజ్ వల్లా ‘ఎంసిఎ’ ను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు నష్టాలు లేకుండా బయటకు వచ్చే స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి అని అంటూ టాలీవుడ్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు..